News April 17, 2024

T20 WCకు వికెట్ కీపర్ అతడేనా?

image

టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించి BCCI సెలక్టర్లకు వికెట్ కీపర్ ఎంపిక తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. IPLలో వికెట్ కీపర్లు ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, జితేశ్ శర్మ, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, సంజూ శాంసన్ రాణిస్తున్నారు. వీరిలో రిషభ్ పంత్‌ను WC కోసం ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాకప్‌గా సంజూ శాంసన్, దినేశ్ కార్తీక్‌‌లలో ఒకరిని తీసుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

Similar News

News January 31, 2026

ఏప్రిల్ 30కి అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి

image

అయోధ్యలో(UP) రామాలయ నిర్మాణ పనులు ఏప్రిల్ 30 నాటికి పూర్తికానున్నాయి. రూ.1,900 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ చివరి దశకు చేరిందని నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. 2 రోజుల సమావేశాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. L&T, టాటా కన్సల్టెన్సీ వంటి సంస్థలతో ఒప్పందాలు ముగియనున్నాయని తెలిపారు. ఏప్రిల్ 30 తర్వాత ఆలయం పూర్తిగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధీనంలోకి వస్తుంది.

News January 31, 2026

ఒకే ఓవర్‌లో 4, 4, 4, 6, 4, 6

image

న్యూజిలాండ్‌తో జరుగుతోన్న ఐదో టీ20లో ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించారు. ఇష్ సోదీ వేసిన 12వ ఓవర్‌లో వరుసగా 4, 4, 4, 6, 4, 6 బాదారు. వైడ్‌తో కలిసి మొత్తం 29 రన్స్ వచ్చాయి.

News January 31, 2026

20 ఏళ్లలోపే స్మోకింగ్‌తో స్ట్రోక్ ముప్పు

image

స్మోకింగ్‌కు, వయసుకు సంబంధం ఉందని దక్షిణకొరియా అధ్యయనంలో వెల్లడైంది. 20 ఏళ్లలోపే స్మోకింగ్ అలవాటు ఉన్నవారికి స్ట్రోక్ ముప్పు 70-80% ఎక్కువగా ఉందని, మధ్యలో స్మోకింగ్ మానేసినా రిస్క్ అలాగే ఉంటుందని తేలింది. ‘20 ఏళ్ల వయసులో శరీరం అభివృద్ధి చెందే దశలోనే ఉంటుంది. స్మోకింగ్ వల్ల విష పదార్థాలు మెదడు, రక్తనాళాలు, గుండె వ్యవస్థలపై శాశ్వత ప్రభావం చూపిస్తాయి’ అని సైంటిస్టులు పేర్కొంటున్నారు. SO BE CAREFUL