News October 20, 2024
2028లోపు మళ్లీ సీఎం అవుతా: కుమార స్వామి
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, దీనికి ఆ పార్టీలోని అంతర్గత సమస్యలే కారణమవుతాయని కేంద్ర మంత్రి కుమారస్వామి జోస్యం చెప్పారు. 2028లోపు తాను మళ్లీ సీఎం పీఠం ఎక్కడం ఖాయమన్నారు. తానేమీ జ్యోతిషుడిని కాకపోయినా ఈ మాట కచ్చితంగా చెబుతున్నానని పేర్కొన్నారు. ఈసారైనా ఐదేళ్లు సీఎం పదవిలో ఉండే అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈయన FEB 2006-OCT 2007, మే 2018- జులై 2019 మధ్య రెండుసార్లు CMగా పనిచేశారు.
Similar News
News January 3, 2025
2 వికెట్లు డౌన్.. పెవిలియన్‌కు భారత ఓపెనర్లు
సిడ్నీలో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టుకు తొలి 10 ఓవర్లలోనే షాక్ తగిలింది. ఓపెనర్లలో తొలుత రాహుల్ (4), తర్వాత జైస్వాల్ (10) ఔట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(4), గిల్(3) ఉన్నారు. కోహ్లీ క్రీజులోకి రాగానే తొలి బంతి ఎడ్జ్ తీసుకొని స్లిప్‌లోకి వెళ్లింది. తొలుత అందరూ ఔట్ అని భావించినా బాల్ గ్రౌండ్‌ను తాకడంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించారు. 9 ఓవర్లకు భారత స్కోర్ 22/2.
News January 3, 2025
వైజాగ్‌లో రేపు నేవీ డే విన్యాసాలు
AP: నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేవీ రేపు విశాఖలో విన్యాసాలు చేయనుంది. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారత నేవీ కృషికి గుర్తుగా ఏటా డిసెంబరు 4న నేవీ డేను జరుపుతున్నారు. గత నెల 4న ఒడిశాలోని పూరీలో విన్యాసాలు నిర్వహించగా ఈ ఏడాది వాటి కొనసాగింపు వేడుకలు వైజాగ్‌లో జరగనున్నాయి.
News January 3, 2025
రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
AP: రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించనుంది. ఈ నెల 1 నుంచి స్టార్ట్ చేస్తారని భావించినా.. అనివార్య కారణాల రీత్యా 4 నుంచి ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది. విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా పథకాన్ని ఆరంభించనున్నారు. 475 కాలేజీల్లో జరిగే ఈ కార్యక్రమం కోసం సర్కారు రూ.115 కోట్లు కేటాయించింది.