News August 10, 2024

ఇండియాలో హిండెన్‌బర్గ్ మరో బాంబ్ పేల్చనుందా?

image

అదానీ గ్రూప్ తన కంపెనీల షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచిందంటూ నివేదిక బయటపెట్టిన హిండెన్‌బర్గ్ మరో సంచలనానికి తెరతీయనున్నట్లు ప్రకటించింది. ‘సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా’ అని ఇవాళ Xలో పోస్టు చేసింది. దీంతో భారత మార్కెట్లు మరోసారి కుదుపునకు లోనయ్యే అవకాశం ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా హిండెన్‌బర్గ్ నివేదిక అసత్యమని సెబీ కూడా వెల్లడించిన విషయం తెలిసిందే.

Similar News

News February 6, 2025

డిన్నర్ కోసమే భేటీ అయ్యాం: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

image

TG: తాము డిన్నర్ కోసమే రహస్యంగా భేటీ అయ్యామని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్‌కు స్పష్టం చేశారు. దీంతో అంతర్గత సమస్యలు ఏమైనా ఉంటే పార్టీ పెద్దలకు తెలపాలని సీఎం వారికి సూచించారు. మరోవైపు ఎమ్మెల్సీ <<15361441>>తీన్మార్ మల్లన్నపై చర్యలు<<>> తీసుకోవాలని నేతలు సీఎంను కోరారు. కాగా ఈ సమావేశానికి మల్లన్న గైర్హాజరు కావడం గమనార్హం.

News February 6, 2025

ప్రైవేటు కంపెనీలకూ ఆధార్ అథెంటికేషన్ సేవలు

image

కేంద్ర ప్రభుత్వం ఆధార్ అథెంటికేషన్ సేవలను ప్రైవేటు సంస్థలకూ విస్తరించింది. ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం డిజిటల్ KYCని ఉపయోగించుకొనేందుకు అనుమతించింది. 2025, JAN 31 నుంచే ప్రభుత్వేతర సంస్థలు ఈ సేవలకు దరఖాస్తు చేసుకొనే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇది BFSI సెక్టార్లో ఓ గేమ్‌ఛేంజర్ అని UIDAI DyDG మనీశ్ భరద్వాజ్ తెలిపారు. 2010 నుంచి తాము 14000 కోట్ల అథెంటికేషన్ లావాదేవీలను ప్రాసెస్ చేసినట్టు తెలిపారు.

News February 6, 2025

చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా

image

రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 6,000 పరుగులు, 600 వికెట్లు తీసిన ఏకైక భారత స్పిన్నర్‌గా (కపిల్ దేవ్ తర్వాత రెండో క్రికెటర్) నిలిచారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆయన ఈ ఘనత సాధించారు. మరోవైపు ఇంగ్లండ్-భారత్ మధ్య జరిగిన వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ ఫీట్ సాధించారు. ఇప్పటివరకు ఆయన 41 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో జేమ్స్ అండర్సన్(40)ను ఆయన అధిగమించారు.

error: Content is protected !!