News July 24, 2024

పార్టీ మారితే అనర్హత వేటు పడుతుందా?

image

తమ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన MLAలపై అనర్హత వేటు వేయాలని BRS డిమాండ్ చేస్తోంది. అయితే దేశంలో ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నా అది ప్రేక్షకపాత్రకే పరిమితమవుతోంది. 1986-2004 మధ్యలో LS స్పీకర్‌ ముందుకు వచ్చిన 55 పిటిషన్లలో 49 మందిపై అనర్హత వేటు పడలేదు. UPకి సంబంధించి 1990-2008 మధ్య 69 పిటిషన్లు వస్తే కేవలం ఇద్దిరిపైనే వేటు పడింది. అటు చాలావరకు రాష్ట్రాల స్పీకర్ల నిర్ణయాలు వెబ్‌సైట్లో లేవు.

Similar News

News November 27, 2025

స్విగ్గీని బురిడీ కొట్టించిన కస్టమర్.. నెటిజన్ల ఫైర్!

image

ఆన్‌లైన్‌ సైట్స్‌లో వస్తువులు డ్యామేజ్ వస్తే సదరు సంస్థ రీఫండ్ చేయడం చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి డూప్లికేట్ ఫొటోతో ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌’ను బురిడీ కొట్టించాడు. స్విగ్గీలో ఆర్డర్ చేసిన గుడ్ల ట్రే ఫొటోను, జెమిని నానో AI యాప్ ద్వారా గుడ్లు పగిలినట్లుగా ఎడిట్ చేసి కస్టమర్‌ కేర్‌కు పంపి, పూర్తి రీఫండ్‌ను పొందాడు. ఇలా చేయడం సరికాదని, నిజమైన బాధితులు నష్టపోతారని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

News November 27, 2025

MLC రాజీనామాపై 4 వారాల్లో తేల్చండి: హైకోర్టు

image

AP: MLC జయమంగళ వెంకటరమణ రాజీనామా లేఖపై నిర్ణయాన్ని తెలపాలని మండలి ఛైర్మన్‌ను హైకోర్టు ఆదేశించింది. రాజీనామాపై సుదీర్ఘకాలం నిర్ణయం తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. విచారణ జరిపి 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. రాజీనామా లేఖ సమర్పించినప్పటికీ చైర్మన్ ఆమోదించడం లేదని జయమంగళ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది.

News November 27, 2025

ఢిల్లీలో మరింత పడిపోయిన గాలి నాణ్యత!

image

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మరోసారి తీవ్రస్థాయికి చేరింది. నేడు ఉదయం గాలి నాణ్యత AQI 351గా రికార్డైంది. ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాలతోపాటు బురారీ, ఆనంద్ విహార్, చందానీ చౌక్, ఐటీఓ, జహంగీర్ పురి ఏరియాల్లో AQI 300 కంటే ఎక్కువ ఉంది. బుధవారం సాయంత్రం 327 వద్ద ఉన్న గాలి నాణ్యత ఈరోజు ఉదయానికి మరింత దిగజారింది. వరుసగా 21వ రోజు కూడా AQI 300 కంటే ఎక్కువ నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది.