News August 20, 2025
ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడితే శిక్ష పడుతుందా?

లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ <<17461749>>గేమింగ్ బిల్లు<<>> పాసైతే ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడే వారికి శిక్ష పడుతుందా? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది. ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవాళ్లు, బాధితులకు ఈ బిల్లు వల్ల ఎలాంటి శిక్షలు పడవని తెలుస్తోంది. ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్ ఆర్గనైజర్స్, సర్వీస్ ప్రొవైడర్స్, అడ్వటైజర్స్, ప్రమోటర్స్, ఫైనాన్షియల్ సపోర్టర్స్‌కి మాత్రమే శిక్షలు పడే అవకాశం ఉంటుందని సమాచారం.
Similar News
News April 1, 2026
మహిళల దృష్టిలో.. ‘ఆడు మగాడ్రా బుజ్జి’

దంపతుల మధ్య లైంగిక స్పందనలు వేర్వేరుగా ఉంటాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. పురుషుడు త్వరగా ఉద్రేకం పొందితే.. స్త్రీ సిద్ధమవడానికి సమయం, స్పర్శ, సురక్షిత భావన అవసరమంటున్నారు. ‘బలవంతంతో కూడిన సెక్స్‌లో ప్రేమ ఉండదు. అది విడాకులకు దారి తీయొచ్చు. పోర్నోగ్రఫీకి దూరంగా ఉండి భాగస్వామి ఇష్టాలను గౌరవిస్తూ ఇద్దరూ ఆనందించడమే వివాహ బంధానికి పరమార్థం. స్త్రీ మనసు గెలవడమే అసలైన మగతనం’అని పేర్కొంటున్నారు.
News April 1, 2026
త్వరలో ఆ రైతుల అకౌంట్లలోకి డబ్బులు!

TG: రాష్ట్రంలో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతులకు త్వరలో రైతుభరోసా సాయం అందనుంది. ఈ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ పూర్తి కాగా, పరిశీలన జరుగుతున్నట్లు సమాచారం. కొత్తగా 62 వేల మంది అప్లై చేసుకోగా, అర్హులుగా గుర్తించిన రైతులకు ఈ నెల 15-20వ తేదీల మధ్య నిధులు జమ చేస్తారని తెలుస్తోంది. గత నెల 23వ తేదీ ఎకరాకు రూ.6వేలు చొప్పున తొలి విడత సాయం రైతుల అకౌంట్లలో జమ చేశారు.
News April 1, 2026
విమాన ఇంధన ధరకు రెక్కలు.. పెరగనున్న టికెట్ రేట్లు

విమానం ఇంధనం ధరలు ఆకాశాన్నంటాయి. కిలో లీటర్(1000 లీటర్లు) ఫ్లైట్ ఆయిల్ ధర రికార్డ్ స్థాయిలో రూ.2,07,341కి చేరింది. గతంలో కిలో లీటర్‌కు రూ.96,638 ఉండగా ఏకంగా రెట్టింపు ధర పెరగడం గమనార్హం. జెట్ ఫ్యూయల్ ధర రూ.2 లక్షల మార్కు దాటడం ఇదే తొలిసారి. ఇక మొత్తంగా గత నెలతో పోలిస్తే ఇంటర్నేషనల్ విమానాల ఫ్యూయల్ ధర 115%, డెమిస్టిక్‌లో 107% పెరిగింది. దీంతో విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగే అవకాశముంది.


