News January 22, 2025
నేను ఇంకా క్రికెట్ ఆడొచ్చేమో: డివిలియర్స్

తాను ఇంకా క్రికెట్ ఆడొచ్చేమో అనే అనుభూతి చెందుతున్నట్లు డివిలియర్స్ చెప్పారు. బంతిని ఊచకోత కోసే ఇతను గ్రౌండ్లోకి అడుగుపెట్టాలనే నిర్ణయంతోనే ఇలా హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘నా కళ్లు ఇంకా పని చేస్తున్నాయి. గ్రౌండ్‌కు వెళ్లి బంతులను కొడుతూ మళ్లీ క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు ఫీల్ అవుతున్నా’ అని చెప్పారు. దీంతో త్వరగా రీఎంట్రీ ఇవ్వాలని ఏబీ ఫ్యాన్స్ SMలో కామెంట్లు పెడుతున్నారు.
Similar News
News September 18, 2025
ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీ

ఆస్ట్రేలియా-Aతో లక్నోలో జరుగుతున్న తొలి అనధికార టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో IND-A ప్లేయర్ ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీ(113*) సాధించారు. తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. పడిక్కల్(86*), సాయి సుదర్శన్(73), జగదీశన్(64) అర్ధశతకాలతో రాణించారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 403 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన AUS-A 532/6కు డిక్లేర్ చేసింది.
News September 18, 2025
జీఎస్టీ సంస్కరణలపై ధన్యవాద తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

AP: జీఎస్టీ సంస్కరణలపై ధన్యవాద తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త పన్నుల విధానంతో ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. పన్నుల విధానంలో 2 శ్లాబులు (5%,18%) మాత్రమే ఉంచి సరళతరం చేశారని పేర్కొన్నారు.
News September 18, 2025
తప్పిన మరో పెను విమాన ప్రమాదం

విశాఖ నుంచి HYD ప్రయాణించాల్సిన ఎయిరిండియా విమానానికి పెనుప్రమాదం తప్పింది. విశాఖలో టేకాఫ్ అయిన కాసేపటికే ఫ్లైట్ ఇంజిన్ ఫ్యాన్ రెక్కల్లో పక్షి చిక్కుకుంది. దీంతో ఫ్యాన్ రెక్కలు దెబ్బతిన్నాయి. అప్రమత్తమైన పైలట్ విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో సేఫ్ ల్యాండింగ్ చేశారు. ఆ టైంలో విమానంలో 103మంది ప్రయాణికులున్నారు. కొన్నినెలల కింద అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్‌లో 270మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.