News August 8, 2025
భారత్, రష్యా, చైనా కలుస్తాయా?

US టారిఫ్స్‌కు వ్యతిరేకంగా భారత్, రష్యా, చైనా ఏకమయ్యే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. రష్యా, బ్రెజిల్ అధ్యక్షులు పుతిన్, లులా భారత్‌కు రానున్నారు. మరోవైపు ప్రధాని మోదీ ఆరేళ్ల తర్వాత చైనాకు వెళ్లనున్నారు. అటు ఇండియాలోని చైనా రాయబారి అమెరికా సుంకాలపై విమర్శలు గుప్పించారు. WTO నియమాలను యూఎస్ ఉల్లంఘిస్తోందన్నారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే USపై ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
Similar News
News August 8, 2025
IPL: RRతో సంజూ కటీఫ్!

రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ శాంసన్ తప్పుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జూన్‌లోనే సంజూ ఈ విషయాన్ని <<17327950>>యాజమాన్యానికి<<>> చెప్పారని, కానీ వారు ఒప్పుకోలేదని ESPNcricinfo తెలిపింది. దీంతో ఈ వ్యవహారాన్ని కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయన ఒప్పుకుంటే సంజూను రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత సంజూను మరో ఫ్రాంచైజీ ఆటగాడితో ట్రేడ్ చేసుకుంటారు. అది సాధ్యం కాకపోతే సంజూ 2026లో వేలంలోకి వెళ్లనున్నారు.
News August 8, 2025
సుంకాల నుంచి ఫార్మాకు మినహాయింపు.. ఎందుకంటే?

అమెరికాలో వాడే జనరిక్ మెడిసిన్లలో 40% మందులు భారత్ నుంచి ఎగుమతి అవుతాయి. క్యాన్సర్, ఇతర ప్రమాదక వ్యాధులకు మన దేశ మందులనే వాడుతారు. అయితే ట్రంప్ సర్కార్ టారిఫ్స్ నుంచి ఫార్మా ఉత్పత్తులకు మినహాయింపు ఇచ్చింది. మెడిసిన్ ధరలు భారీగా పెరిగితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని భారత ఫార్మా కంపెనీలు USలోనే ఉత్పత్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి.
News August 8, 2025
రేప్ కేసులో పాక్ క్రికెటర్ అరెస్టు.. బెయిల్‌పై విడుదల

రేప్ కేసులో పాకిస్థాన్-A క్రికెటర్ హైదర్ అలీని ఇంగ్లండ్ మాంచెస్టర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంగ్లండ్-Aతో వన్డేలు ఆడేందుకు UK వచ్చినప్పుడు అతడు తనపై అత్యాచారం చేశాడని పాకిస్థాన్‌కు చెందిన యువతి ఫిర్యాదు చేసింది. AUG 3న అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకుని అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. అటు విచారణ పూర్తయ్యే వరకు అలీని సస్పెండ్ చేస్తున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది.