News February 12, 2025
బుమ్రా లేకుండా భారత్ కప్పు కొడుతుందా?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు బుమ్రా దూరం కావడంతో టీమ్ ఇండియా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. జట్టుకు బుమ్రా చాలా ముఖ్యమని, అతడు లేకుంటే బౌలింగ్ దళం బలహీనంగా మారుతుందని చెబుతున్నారు. 2022 ఆసియా కప్, టీ20 ప్రపంచకప్, 2023 WTC ఫైనల్కు బుమ్రా దూరమయ్యారని.. ఫలితంగా భారత్ ఆ కప్పులను కోల్పోయిందని గుర్తు చేస్తున్నారు. మరి ఈసారి బుమ్రా లేకుండా భారత్ ఈ ఐసీసీ ట్రోఫీని ముద్దాడుతుందా? కామెంట్ చేయండి.
Similar News
News February 12, 2025
ప్రధానికి బెదిరింపు కాల్
PM మోదీ టార్గెట్గా బెదిరింపు కాల్ వచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన విదేశీ పర్యటన నేపథ్యంలో ప్రయాణిస్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకుంటామని ఓ దుండగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. అప్రమత్తమైన అధికారులు భద్రతా సిబ్బందికి సమాచారమివ్వడంతో కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దుండగుడిని మతిస్థిమితం సరిగ్గా లేని వ్యక్తిగా గుర్తించారు. మోదీ పర్యటనకు ముందే ఈ కాల్ వచ్చినట్లు తెలిపారు.
News February 12, 2025
‘లైలా’ రన్ టైమ్ ఎంతంటే?
‘లైలా’ మూవీకి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా రన్ టైమ్ ఎండింగ్ కార్డ్స్తో కలుపుకొని 2 గంటల 16 నిమిషాలు ఉన్నట్లు మూవీ వర్గాలు పేర్కొన్నాయి. విశ్వక్ సేన్, ఆకాంక్ష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఎల్లుండి థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల కమెడియన్ <<15413032>>పృథ్వీ చేసిన వ్యాఖ్యలతో<<>> ఈ మూవీ టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
News February 12, 2025
కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు.. ఇవి తీసుకెళ్లండి!
TG: కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసే వారు మీసేవ సెంటర్లకు తమ కుటుంబసభ్యుల ఆధార్ కార్డులతో పాటు కరెంట్ బిల్లులను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఇదివరకే రేషన్ కార్డు ఉండి ఫ్యామిలీలోని ఇతరుల పేర్లను జత చేయాలనుకుంటే ఆధార్ కార్డులు ఇవ్వాలి. ఇప్పటికే ప్రజాపాలన, ప్రజావాణిల్లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు రూ.50. అంతకంటే ఎక్కువ తీసుకుంటే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.