News September 1, 2025

ఇందిరమ్మ చీరలు ఈసారైనా చేరేనా..?

image

తెలంగాణలో ఈసారి కూడా ఇందిరమ్మ చీరల పంపిణీ అనుమానమే. గతేడాది శారీలు ఇవ్వని సర్కారు ఈసారి మరింత క్వాలిటీతో మహిళా సంఘాల సభ్యులకు రెండు చీరలు అందిస్తామని ఇటీవలే చెప్పింది. సెప్టెంబర్ 21 – 30 మధ్య బతుకమ్మ వేడుకలు జరగనుండగా, సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. దీంతో ఇందుకు రెండు వారాల ముందే నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ అమల్లోకి రావచ్చు. ఈ పరిణామాలను బట్టి ఈసారీ ఆడబిడ్డలకు చీరలు అందకపోవచ్చు.

Similar News

News September 4, 2025

‘సోనియాపై FIR నమోదుకు ఆదేశించండి’

image

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించాలని వికాస్ త్రిపాఠి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. 1980లో ఆమె భారత సిటిజన్ షిప్ లేకుండానే ఓటు నమోదు చేసుకున్నారని, ఉద్దేశపూర్వకంగా ఫోర్జరీ చేశారని ఆరోపించారు. 1982లో ఆమె ఓటును డిలీట్ చేసి 1983లో తిరిగి చేర్చారని పేర్కొన్నారు. దీనిపై కోర్టు విచారణను సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది. కాగా సోనియాకు భారత పౌరసత్వం 1983లో లభించింది.

News September 4, 2025

కంప్యూటర్ సైన్స్ చదివితే ప్రభుత్వ ఉద్యోగాలు

image

డిగ్రీ, పీజీ లెవల్లో కంప్యూటర్స్ చదివిన వారికి ప్రభుత్వ రంగంలో విస్తృత అవకాశాలున్నాయి. మాస్టర్స్, PHD చేసి టీచింగ్/రీసెర్చ్‌లో కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు. రైల్వే, డిఫెన్స్, స్పేస్, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల్లోనూ వీరికి అనేక నియామకాలుంటాయి. రాష్ట్ర స్థాయిలో కూడా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటారు. కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌గా, సిస్టమ్స్‌ అనలిస్ట్‌గా, సిస్టమ్స్‌ మేనేజర్‌గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

News September 4, 2025

GST: సినిమా టికెట్లు, పాప్ కార్న్‌పై ఇలా..

image

<<17605492>>జీఎస్టీ<<>> శ్లాబుల్లో మార్పుతో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కాస్త ఊరట లభించనుంది. రూ.100, ఆ లోపు టికెట్లపై GSTని 12% నుంచి 5%కి కేంద్రం తగ్గించింది. అయితే రూ.100పైన టికెట్లకు మాత్రం 18% వసూలు కొనసాగనుంది. దీంతో మల్టీప్లెక్స్‌లో ఎప్పటిలాగే టికెట్ల ధరలు ఉండనున్నాయి. ఇక పాప్‌కార్న్ ధరలపై విమర్శలు ఉండగా ప్యాకేజీతో సంబంధం లేకుండా సాల్ట్ పాప్‌కార్న్ 5శాతం, క్యారమిల్ పాప్‌కార్న్‌ 18శాతంలోకి రానుంది.