News October 19, 2024
రేపు బెంగళూరులో వర్షం వస్తుందా..?

న్యూజిలాండ్తో తొలి టెస్టులో గట్టెక్కడం భారత్కు దాదాపు అసాధ్యమే. కివీస్ విజయలక్ష్యం కేవలం 107 పరుగులు మాత్రమే. ఈ నేపథ్యంలో వరుణుడు ఎంటర్ అయితేనే టీమ్ ఇండియా కనీసం డ్రాతో బయటపడేందుకు అవకాశం ఉంటుంది. ఆక్యువెదర్ అంచనాల ప్రకారం రేపు 30 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడుతుంది. మరి 107 రన్స్ను NZ ఛేజ్ చేస్తుందా లేక టీమ్ ఇండియా బౌలింగ్తో ఏమైనా అద్భుతం సృష్టించగలదా అన్నది చూడాలి మరి.
Similar News
News October 22, 2025
శ్రీలంక నేతను కాల్చి చంపేశారు

శ్రీలంక దేశం వెలిగామా కౌన్సిల్ ఛైర్మన్, ప్రతిపక్ష సమాగి జన బలవేగయ పార్టీ నేత లసంత విక్రమశేఖర(38) దారుణ హత్యకు గురయ్యారు. తన ఆఫీసులో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న సమయంలో ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. విక్రమశేఖరను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
News October 22, 2025
రేపు జగన్ మీడియా సమావేశం

AP: YCP చీఫ్ వైఎస్ జగన్ గురువారం ఉదయం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారని పార్టీ ప్రకటన విడుదల చేసింది. సమకాలీన రాజకీయాంశాలపై ఆయన మాట్లాడనున్నారు. పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ గురించి వివరిస్తారని తెలుస్తోంది. అలాగే నకిలీ మద్యం, రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్కు, కాకినాడ సెజ్ భూములు తదితరాలపై వివరాలు వెల్లడిస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
News October 22, 2025
బంగ్లా నేవీ అధీనంలో 8మంది AP మత్స్యకారులు

పొరపాటున తమ జలాల్లోకి ప్రవేశించిన విజయనగరానికి చెందిన 8మంది మత్స్యకారులను బంగ్లా నేవీ అదుపులోకి తీసుకుంది. భోగాపురం మం. కొండ్రాజుపాలెంకి చెందిన మరుపుల్లి చిన్న అప్పన్న, రమేశ్, అప్పలకొండ, ప్రవీణ్, చిన్నఅప్పన్న, రాము, పూసపాటిరేగ మం. తిప్పలవలసకి చెందిన రమణ, రాము విశాఖలోని పోర్ట్ ఏరియాలో ఉంటున్నారు. ఈనెల 13న వేటకు వెళ్లగా.. దారి తప్పి 14న అర్ధరాత్రి 2 గం.కు బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించారు.