News August 23, 2024

ఈసారైనా కొలిక్కి వచ్చేనా?

image

కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కొనసాగుతోంది. కొత్త టీపీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చిస్తున్నారు. ఆయా అంశాలపై ముఖ్య నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తుది నిర్ణయం వాయిదా పడుతూ వస్తోంది. ఈసారైనా చర్చలు కొలిక్కి వస్తాయేమో చూడాలి.

Similar News

News March 19, 2026

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రివ్యూ&రేటింగ్

image

అవినీతి నాయకులు, వారికి సాయపడే టెర్రరిస్టులను హీరో ఎలా ఎదుర్కొన్నారనేదే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్టోరీ. మేనరిజమ్స్, డాన్సులు, నటనతో పవన్ వన్‌మ్యాన్ షో చేశారు. చిరు-పవన్ పాత సాంగ్స్ ఆకట్టుకుంటాయి. శ్రీలీల నటన బాగుంది. ఫ్యాన్స్ కోసం మాస్ ఎలివేషన్స్, డైలాగులతో డైరెక్టర్ హరీశ్ శంకర్ కథను నడిపించారు. ఔట్‌డేటెడ్ స్టోరీ, కొన్ని లాజిక్ లేని సీన్లు, BGM మైనస్. కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు.
రేటింగ్: 2.5/5

News March 19, 2026

దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

image

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.

News March 19, 2026

ఒక్క రోజే రూ.10వేలు తగ్గిన వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధర భారీగా తగ్గింది. ఇవాళ ఒక్కరోజే రూ.10 వేలు తగ్గి కిలో రూ.2,65,000 పలుకుతోంది. గత వారంతో పోల్చితే మొత్తంగా రూ.25,000 తగ్గుదల నమోదైంది. అటు <<19423062>>బంగారం<<>> ధరలు కూడా ఇవాళ తగ్గిన విషయం తెలిసిందే.