News April 28, 2024
WILL JACKS: 10 బంతుల్లోనే అర్ధ సెంచరీ

గుజరాత్తో మ్యాచ్లో RCB ఆల్రౌండర్ విల్ జాక్స్ (41 బంతుల్లో 100) సెంచరీతో అరాచకం సృష్టించారు. అర్ధ సెంచరీ తర్వాత 10 బంతుల్లోనే శతకం బాదారు. అంతకుముందు 31 బంతుల్లో జాక్స్ ఫిఫ్టీ చేశారు. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగారు. మోహిత్ వేసిన ఓవర్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లు.. రషీద్ ఖాన్ వేసిన ఓవర్లో ఒక ఫోర్, 4 సిక్సర్లతో విధ్వంసం సృష్టించారు. అతడి ధాటికి బంతి ఎక్కడ వేయాలో తెలియక రషీద్ ఖాన్ బెంబేలెత్తిపోయారు.
Similar News
News November 22, 2025
ఇందిరమ్మ చీరలు.. నేతన్నకు చేతినిండా పని..!

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ పథకం సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు ఊతమిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి చీరల పంపిణీకి 4.30 కోట్ల మీటర్ల వస్త్రాన్ని సిరిసిల్లలోని 9,600 పైచిలుకు మరమగ్గాలపై నేస్తున్నారు. రూ.450 కోట్ల బడ్జెట్తో ఈ కార్యక్రమం చేపట్టగా స్థానికంగా దాదాపు 10వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది.
News November 22, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,860 పెరిగి రూ.1,25,840కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,700 ఎగబాకి రూ.1,15,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధరపై రూ.3,000 పెరిగి రూ.1,72,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 22, 2025
AP TET..అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఏపీ టెట్కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. రేపటితో అప్లికేషన్ల ప్రాసెస్ ముగియనుండటంతో అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులకు మాక్ టెస్ట్ ఆప్షన్ NOV 25న అందుబాటులోకి వస్తుంది. DEC 3నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. DEC 10 నుంచి ప్రతిరోజూ 2 సెషన్లలో ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి అని సుప్రీంకోర్టు పేర్కొంది. వెబ్సైట్: https://tet2dsc.apcfss.in/


