News March 16, 2024
జగన్‌కు ఈసారి ఆ సెంటిమెంట్ కలిసొచ్చి విజయం వరించేనా..?

మరికాసేపట్లో ఇడుపులపాయలో వైసీపీ అభ్యర్థులను జగన్ ప్రకటించనున్నారు. జిల్లాకు చేరుకున్న సీఎం ఇడుపులపాయ బయలుదేరి వెళ్లారు. మహానేత సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం మంత్రి ధర్మాన ప్రసాదరావు, బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌లు అభ్యర్థులను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. గత 2019 ఎన్నికల సమయంలో వీరు ఇద్దరే ఎన్నికల అభ్యర్థులను ప్రకటించారు. మరి అదే సెంటిమెంట్ ఈసారి ఎన్నికలలో కలిసొస్తుందా చూడాలి.
Similar News
News January 19, 2026
వాట్సాప్‌లోనే FIR కాపీ.. స్టేషన్లకు వెళ్లక్కర్లేదు!

మద్దికేర పోలీస్ స్టేషన్ పరిధిలోని FIR వివరాలు ఇకపై వాట్సాప్ ద్వారా సులభంగా పొందవచ్చని SI హరిత ఆదివారం తెలిపారు. 9552300009 నంబర్‌కు మెసేజ్ పంపి, మెనూలో పోలీస్ విభాగాన్ని ఎంచుకుని కేస్ నంబర్ ఎంటర్ చేస్తే ఉచితంగా కాపీ లభిస్తుందన్నారు. దీనివల్ల ప్రజలు స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదని పేర్కొన్నారు. ఈ నూతన విధానంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News January 18, 2026
కర్నూలులో బహిరంగ హెచ్చరిక బ్యానర్లు

కర్నూలు నగరంలో ఆస్తిపన్ను మొండి బకాయిల వసూళ్లను నగరపాలక సంస్థ మరింత కఠినతరం చేస్తోంది. ఈక్రమంలో ‘మేలుకో బకాయిదారుడా!’ అనే శీర్షికతో ఆదివారం హెచ్చరికాత్మక బ్యానర్లను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఈ చర్యలతో అయినా బకాయిదారుల్లో చైతన్యం వచ్చి, స్వచ్ఛందంగా పన్నులు చెల్లించే పరిస్థితి ఏర్పడుతుందన్న ఆశతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే మొండి బకాయిదారుల పట్ల అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
News January 18, 2026
కర్నూలు: చుక్కలు చూపిస్తున్న చికెన్ ధరలు

కర్నూలు జిల్లాలో చికెన్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కోడుమూరు, గోనెగండ్ల, పెద్దకడబూరు, పత్తికొండ, ఆలూరు, ఆస్పరి, ఎమ్మిగనూరు, ఆదోని, దేవనకొండ తదితర మండలాల్లో లైవ్ కిలో రూ.195, స్కిన్ రూ.300, స్కిన్లెస్ రూ.310-320 చొప్పున విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ.800-900, చేపలు రూ.180కి అమ్ముతున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.


