News June 17, 2024
కమల్ బయోపిక్ డైరెక్ట్ చేస్తారా?.. శ్రుతిహాసన్ ఆన్సర్ ఇదే
హీరోయిన్‌గానే కాకుండా మ్యూజిక్ ఆల్బమ్స్‌ని సైతం రూపొందిస్తూ మల్టీ టాలెంటెడ్‌గా పేరు తెచ్చుకున్నారు శ్రుతిహాసన్. తన తండ్రి కమల్ హాసన్ బయోపిక్‌ను డైరెక్ట్ చేయడంపై తాజాగా ఆమె స్పందించారు. ఆయన జీవిత చరిత్రను తీయడానికి తాను సరైన వ్యక్తి కాదని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో గొప్ప దర్శకులున్నారని.. వారైతే అద్భుతంగా తెరకెక్కించగలరని చెప్పారు. తాను తీస్తే ఒక వైపు నుంచి పక్షపాతంగా తీసినట్లు అనిపిస్తుందన్నారు.
Similar News
News December 28, 2024
ఓటీటీలోకి కొత్త చిత్రం
కేన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ‘గ్రాండ్ పిక్స్’ అవార్డును పొందిన ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ మూవీ OTTలోకి రానుంది. పాయల్ కపాడియా తెరకెక్కించిన ఈ ఫీచర్ ఫిల్మ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో JAN 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ముంబై నర్సింగ్ హోమ్‌లో పనిచేసే ఇద్దరు నర్సుల కథే ఈ చిత్రం. కశ్రుతి, దివ్య ప్రధాన పాత్రల్లో నటించారు. US మాజీ అధ్యక్షుడు ఒబామా మెచ్చిన ఈ మూవీ గోల్డెన్ గ్లోబ్ నామినేషన్స్‌నూ పొందింది.
News December 28, 2024
DAY 3: నిలిచిన ఆట.. నితీశ్-సుందర్ సెంచరీ భాగస్వామ్యం
బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజు వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. ఆట నిలిచే సమయానికి భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. నితీశ్(85*), సుందర్(40*) క్రీజులో ఉన్నారు. ఇవాళ తొలి సెషన్లో టీమ్ ఇండియా రెండు వికెట్లు కోల్పోగా, రెండో సెషన్లో నితీశ్-సుందర్ 105 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మ్యాచ్ నిలిచిపోవడంతో అంపైర్లు టీ బ్రేక్ ప్రకటించారు.
News December 28, 2024
మొబైల్ రీఛార్జ్ ధరలు పెంపు?
టెలికం కంపెనీలు టారిఫ్ రేట్లను పెంచే అవకాశం ఉందని ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ వెల్లడించింది. వచ్చే ఏడాది DECలో 15% టారిఫ్ పెంచవచ్చని తెలిపింది. ARPU లెవెల్స్ పెంచుకునేందుకు టెలికం కంపెనీలు ఇక నుంచి తరచూ ఈ పద్ధతి కొనసాగించొచ్చని పేర్కొంది. కాగా గత ఐదేళ్లలో మూడు సార్లు (2019, 21, 24)టారిఫ్ పెంచారు. 2019 SEPలో రూ.98 ఉన్న రీఛార్జ్ ప్లాన్ 2024 SEPకు రూ.193కి ఎగబాకింది.