News March 23, 2024
కవితకు బెయిల్ వస్తుందా?
TG: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఆమెను ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తును కోర్టు పరిశీలించనుంది. కాగా కవితను ఈ నెల 15న ఈడీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచింది. వారం రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే.
Similar News
News January 8, 2025
బూమ్ బూమ్ బీరు తీసుకొచ్చేందుకు కుట్ర: హరీశ్ రావు
TG: రాష్ట్రంలోకి లోకల్ బ్రాండ్స్ బూమ్ బూమ్, బిర్యానీ బీర్లు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందని BRS నేత హరీశ్ రావు అన్నారు. అందుకే కింగ్ ఫిషర్, హీనెకిన్ బీర్ల సరఫరా నిలిపివేసిందని సర్కార్‌పై మండిపడ్డారు. ‘బీర్ల నిలిపివేతపై మాకు పలు అనుమానాలు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగానే వీటి సరఫరాను నిలిపేశారు. UBLకు పెండింగ్ బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైంది’ అని ఆయన ట్వీట్ చేశారు.
News January 8, 2025
కోహ్లీ నాకు దేవుడు: కోన్స్టాస్
విరాట్ కోహ్లీ తనకు క్రికెట్ దేవుడని ఆస్ట్రేలియా యువ క్రికెటర్ సామ్ కోన్స్టాస్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఆయన ఆటను చూస్తూ పెరిగాను. కోహ్లీ ఆడుతున్న సమయంలో నేను ఆడటమే నాకో గౌరవం. మ్యాచ్‌లు ముగిశాక నేను ఆయనతో మాట్లాడాను. నేను ఎంత పెద్ద అభిమానినో చెప్పాను. ఆయన చాలా మంచి వ్యక్తి. చాలా గౌరవంగా మాట్లాడారు. శ్రీలంక సిరీస్‌కు నేను ఎంపికైతే బాగా ఆడాలని విష్ చేశారు’ అని వెల్లడించారు.
News January 8, 2025
‘గేమ్ ఛేంజర్’ టికెట్ ధరల పెంపు
తెలంగాణలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతించింది. తొలి రోజు ఉ.4 గంటల షోతో సహా ఆరు ఆటలకు అనుమతిస్తూ సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లో రూ.150 చొప్పున పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ నెల 11 నుంచి 19 వరకు ఐదు షోలకు అనుమతి ఇస్తూ సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.100 చొప్పున పెంచుకోవచ్చని పేర్కొంది.