News August 7, 2025
KCRను జైలుకు పంపుతారా? CM రేవంత్ సమాధానమిదే..

TG: ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా CM రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. KCRను జైలుకు పంపుతారా? అన్న ప్రశ్నకు ‘ఆయనను నేనెందుకు జైలులో వేస్తా. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు, చర్లపల్లి జైలుకు తేడా ఏముంది? కేసీఆర్ ఓడిపోవడమే పెద్ద శిక్ష. నేను విద్వేష రాజకీయాలు చేయను’ అని స్పష్టం చేశారు. ఇక బిహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కూడా ఉండే అవకాశం ఉందని సీఎం అన్నారు.
Similar News
News August 18, 2025
దేశాన్ని వీడుతున్న మేధావులు!

దేశాన్ని వీడుతున్న వారిలో ఇన్వెస్టర్లు మాత్రమే కాకుండా ఇంజినీర్లు, డాక్టర్లు, JEE ర్యాంకర్లు ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. దీంతో 2 బిలియన్ డాలర్ల IT మేధస్సును కోల్పోతున్నామని రెడిట్‌లో పేర్కొన్నారు. దీనికి దేశంలోని అవినీతి, రెడ్ టాపిజం(అధికార జాప్యం), వివక్ష కారణమన్నారు. అయితే ఎదుగుదలకు రిజర్వేషన్లే కారణమని భావిస్తే దేశంలోనే ఉంటూ సొంత మార్గాన్ని అన్వేషించుకోవచ్చని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
News August 18, 2025
సుభాష్ చంద్రబోస్.. జననం తప్ప మరణం లేని యోధుడు!

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో కీలక పాత్ర పోషించిన జాతీయవాద నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. 1897 JAN 23న ఒడిశాలో జన్మించారు. ‘నాకు రక్తం ఇవ్వండి. నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను’ అని యువతను ఉత్తేజపరిచి ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ స్థాపించి బ్రిటిషర్లకు చుక్కలు చూపించారు. 1945 ఆగస్టు 18న బోస్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయినప్పటికీ ఆయన మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.
News August 18, 2025
ఫ్రీ బస్సు.. నేటి నుంచి జాగ్రత్త

AP: ఉచిత బస్సు పథకానికి మంచి ఆదరణ లభిస్తోంది. నేటి నుంచి విద్యాసంస్థలు, కార్యాలయాలు తెరుచుకోవడంతో రద్దీ భారీగా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. బస్సులు ఎక్కేటప్పుడు కంగారు పడొద్దని, డ్రైవర్లు, కండక్టర్లకు సహకరించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే మహిళలకు సూచించారు. గత శుక్రవారం ఈ స్కీమ్ ప్రారంభించగా నిన్న రాత్రి 8 గం. వరకు 13.30 లక్షల మంది మహిళలు ప్రయాణించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.