News September 1, 2025

కూతురి ఆరోపణలపై KCR ఇప్పటికైనా స్పందిస్తారా?

image

TG: కవిత కామెంట్స్‌పై ఆమె తండ్రి, మాజీ CM KCR ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరం. గతంలో ఆమె కామెంట్స్ చేసినప్పుడు ఆయనేమీ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు పార్టీలో మెయిన్ లీడర్ హరీశ్ రావుతో పాటు తన వెన్నంటే ఉండే సంతోష్‌పై <<17582704>>ఆరోపణలు<<>> చేయడాన్ని ఆయన ఎలా తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. తండ్రిగా ఆమెకు మద్దతిస్తారా? లేక పార్టీ హద్దు దాటినందుకు వేటు వేస్తారా? మీరేమంటారు?

Similar News

News September 4, 2025

OTTలోకి రజినీకాంత్ ‘కూలీ’.. ఎప్పుడంటే?

image

రజినీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 11 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నాగార్జున, శ్రుతిహాసన్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ తదితరులు నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.

News September 4, 2025

రాష్ట్రంలోని పౌరులందరికీ ఉచిత ఆరోగ్య బీమా

image

APలోని పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ భేటీ అయిన మంత్రివర్గం యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్-ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఈ పాలసీని అమలు చేయనుంది. ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానాన్ని రూపొందించింది. 1.63 కోట్ల కుటుంబాలకు హైబ్రిడ్ విధానంలో 3,257 చికిత్సలు అందించనుంది.

News September 4, 2025

పత్తిలో జింకు లోప లక్షణాలు – నివారణ

image

ఈ లోపం మొక్క మధ్య ఆకుల మీద కనిపిస్తుంది. ఆకులు, ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్యభాగం పసుపు పచ్చగా మారుతుంది. కొమ్మ చివరి ఆకులు చిన్నవిగా ముడతలు పడి కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. జింక్ లోపం గల నేలల్లో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. మొక్క మీద లోప లక్షణాలు గమనించినప్పుడు లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని 7 నుంచి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.