News May 20, 2024

సాల్ట్ లేని KKR.. చప్పగా మారనుందా?

image

కోల్‌కతా తిరుగులేని విజయాలు సాధించడంలో ఓపెనర్లు నరైన్(461 రన్స్), ఫిల్ సాల్ట్(435)ది కీలక పాత్ర. వారి మెరుపులతోనే KKR భారీ స్కోర్లు చేసి విజయాల బాటపట్టింది. అయితే.. T20WC కోసం సాల్ట్ ఇంగ్లండ్ వెళ్లారు. దీంతో KKR ఓపెనింగ్‌పై ఆందోళనలు నెలకొన్నాయి. ఆ స్థానంలో వెంకటేశ్ అయ్యర్‌ను దించే అవకాశం ఉంది. అయ్యర్ 267రన్స్‌ చేసి ఫరవాలేదనిపిస్తున్నా కీలక ప్లేఆఫ్స్‌లో ఒత్తిడి తట్టుకోగలరా అనేది సందేహంగా మారింది.

Similar News

News November 19, 2025

ఇతిహాసాలు క్విజ్ – 71 సమాధానాలు

image

ప్రశ్న: గణేశుడు భారతాన్ని రాసేటప్పుడు తన దంతాన్ని ఎందుకు విరిచాడు?
జవాబు: వినాయకుడు భార‌తం రాసేట‌ప్పుడు ఈకలు ప్రతిసారి విరిగిపోయాయి. రచనను మ‌ధ్య‌లో ఆగిపోకూడ‌ద‌నే ష‌ర‌తుకు క‌ట్టుబ‌డిన గ‌ణేషుడు ఈకలతో పని కాదని గ్రహించి త‌న దంతాన్ని విరిచి మహాభారతాన్ని రాయ‌డం పూర్తిచేశాడు. మ‌రో క‌థనం ప్ర‌కారం.. ప‌ర‌శురాముణ్ని నిరోధించ‌డంతో రెండు దంతాల్లో ఒక దాన్ని విరిచేస్తాడ‌ని చెబుతారు. <<-se>>#Ithihasaluquiz<<>>

News November 19, 2025

ధనుష్ పేరిట కమిట్మెంటు అడిగారు: మాన్య

image

హీరో ధనుష్ పేరిట కమిట్మెంటు అడిగారని తమిళ నటి మాన్య ఆనంద్ ఆరోపించారు. ధనుష్ నిర్మించే సినిమాలో నటించేందుకు శ్రేయస్ అనే వ్యక్తి కాల్ చేశాడన్నారు. ధనుష్ కోసమంటూ కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పాడన్నారు. స్క్రిప్ట్, ప్రొడక్షన్ హౌస్ లొకేషన్ పంపగా నంబర్‌ను బ్లాక్ చేశానని చెప్పారు. దీనిపై ధనుష్ టీమ్ స్పందిస్తూ మేనేజర్ పేరిట ఎవరో అమ్మాయిల్నిబ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపింది.

News November 19, 2025

రాష్ట్రంలో 324 ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

image

TG: రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో ఖాళీగా ఉన్న 324 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని ఈవోలకు దేవదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈవోలు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఆలయాల వారీగా రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.