News February 23, 2025
పాకిస్థాన్‌తో మ్యాచ్.. కోహ్లీ ఆడేనా?

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత స్టార్ క్రికెటర్ కోహ్లీ ఆడటం అనుమానాస్పదంగా మారిందని జాతీయ మీడియా పేర్కొంది. నిన్న ప్రాక్టీస్ సెషన్లో కాలికి గాయం కావడంతో, ఐస్ ప్యాక్‌తో రెస్ట్ తీసుకుంటూ కనిపించినట్లు వెల్లడించింది. ఆ ఫొటోలు SMలోనూ చక్కర్లు కొడుతున్నాయి. అయితే కోహ్లీ గాయంపై BCCI ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో కీలక మ్యాచ్‌లో కోహ్లీ ఆడతాడని అంతా భావిస్తున్నారు. మ్యాచ్ సమయానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Similar News
News November 14, 2025
నేడు ఈ అమ్మవారిని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు

లక్ష్మీదేవి విగ్రహాల్లో వ్యూహలక్ష్మి ప్రతిమను దర్శించుకుంటే భక్తులకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ దివ్య రూపం తిరుమల శ్రీవారి వక్షస్థలంలో కొలువై ఉంటుంది. స్వామివారి సమస్త జగత్తును పాలించే పరాశక్తి స్వరూపాన్ని హృదయంలో ధ్యానించడం వలన అఖండమైన ఐశ్వర్యంతో పాటు, ధైర్యం, జ్ఞానం వంటి అష్టైశ్వర్యాలు సిద్ధించి, సమస్త దోషాలు తొలగిపోతాయట. ఈ రూపంలో అమ్మను ‘త్రిభుజా’ అని పిలుస్తారు.
News November 14, 2025
కొనుగోలు కేంద్రాల్లో వరికి మంచి ధర రావాలంటే..

వరి కోత, నూర్పిడి సమయంలో ధాన్యంలో తేమశాతం 23 నుంచి 26 శాతం వరకు ఉంటుంది. అప్పుడు ధాన్యాన్ని టార్పలిన్ లేదా ప్లాస్టిక్ పట్టాలపై పలుచగా ఆరబెడితే గింజ రంగు మారకుండా నల్లగా కాకుండా మంచి నాణ్యతగా ఉంటుంది. కొనుగోలు కేంద్రాల్లో మంచి ధర రావాలంటే ధాన్యంలో బెరుకు గింజలు 6%, తేమశాతం 17%, పుచ్చిపోయిన గింజలు 5%, ఇతర వ్యర్థ పదార్థాలు 1%, పక్వానికి రాని గింజలు 3% గరిష్ఠ స్థాయి మించకుండా ఉండేలా చూసుకోవాలి.
News November 14, 2025
న్యూ స్పేస్ ఇండియాలో 47 పోస్టులు

<


