News December 21, 2024

ఈడీ కేసుపైనా హైకోర్టుకు కేటీఆర్?

image

ఫార్ములా ఈ-రేసు వ్యవహారంపై ఏసీబీ కేసు విషయంలో కేటీఆర్‌కు కొంత ఊరట దక్కిన సంగతి తెలిసిందే. ఆయనను ఈనెల 30 వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. అయితే గంటల వ్యవధిలోనే ఆయనపై <<14936688>>ఈడీ కేసు<<>> ఫైల్ చేసింది. దీనిని కూడా క్వాష్ చేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. క్వాష్ పిటిషన్ వేయాలా? పిటిషన్ వేయకుండా ఈడీ విచారణకు హాజరవ్వాలా అనే దానిపై ఆయన న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Similar News

News December 21, 2024

HYDలో తొలి ప్రపంచ ధ్యాన దినోత్సవం

image

TG: ధ్యానం, దాని ప్రయోజనాల గురించి అవగాహన పెంచడానికి ఏటా డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించాలని ఇటీవల ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో తొలి ప్రపంచ ధ్యాన దినోత్సవం కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇవాళ సా.5 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, CM రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పాల్గొంటారు.

News December 21, 2024

నేటితో ముగియనున్న అసెంబ్లీ, మండలి సమావేశాలు

image

TG: అసెంబ్లీ, మండలి సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈనెల 9న ప్రారంభమైన సమావేశాలు 16కు వాయిదా పడ్డాయి. 16న తిరిగి ప్రారంభమై నేడు ముగియనున్నాయి. ఈరోజు రైతు భరోసా పథకంపై అసెంబ్లీ, శాసన మండలిలో చర్చించనున్నారు. అనంతరం మంత్రివర్గం విధి విధానాలు ఖరారు చేసి, సంక్రాంతి తర్వాత నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది.

News December 21, 2024

స్థానిక సంస్థల ఎన్నికలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

image

TG: ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రూల్‌ను మార్చాలంటూ వచ్చిన ప్రతిపాదనను రిజెక్ట్ చేసింది. ఈ నిబంధన మినహా ఇతర అంశాలతో పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. కాగా ఏపీలో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించిన సంగతి తెలిసిందే.