News April 25, 2024

రుణమాఫీ హామీ ‘గేమ్ ఛేంజర్’ అవుతుందా?

image

TG: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీ అంశాన్ని బాగా ప్రచారం చేస్తోంది. ఆగస్టు 15లోగా రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేస్తామని సీఎం రేవంత్ ప్రతి సభలోనూ నొక్కి చెబుతున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీల హామీ మాదిరిగా ఎంపీ ఎలక్షన్స్‌లో రుణమాఫీ గేమ్‌ఛేంజర్‌గా మారి కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓట్లు పడేలా చేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీరేమంటారు?

Similar News

News January 30, 2026

అవాంఛిత రోమాలకు ఇలా చెక్

image

మహిళలను ఎక్కువగా వేధించే సమస్య అవాంఛిత రోమాలు. వీటిని కొన్ని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. పాలలో పసుపు వేసి కలిపి ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట రాసి 20 నిమిషాల తర్వాత వేడి నీటితో కడిగేసినట్లైతే రోమాలన్నీ తొలగిపోతాయి. ఒక అరటిపండు గుజ్జు, రెండు స్పూన్ల ఓట్‌ మీల్‌ కలిపి ముఖానికి పట్టించాలి, కాసేపు మర్దనా చేసుకోవాలి. స్నానం చేసేటప్పుడు ఫేస్‌కు పసుపు రాసి కడుక్కుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది.

News January 30, 2026

భక్తుల మనోభావాలను దెబ్బతీసిన పాపం చంద్రబాబుదే: సజ్జల

image

AP: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు అబద్ధపు ఆరోపణలు చేశారంటూ YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు అబద్ధమని 2 ల్యాబ్ రిపోర్టులు తేల్చాయని చెప్పారు. ‘భక్తుల మనోభావాలను దెబ్బతీసిన పాపం చంద్రబాబుదే. తప్పు చేశామని ఒప్పుకునే విచక్షణ ఆయనకు లేదు. ఆరోపణలకు ఆధారాలు లేక వైసీపీపై దాడి చేస్తున్నారు. చంద్రబాబును ప్రజాక్షేత్రంలో నిలదీయాలి’ అని మీడియా సమావేశంలో అన్నారు.

News January 30, 2026

HYDకి మించిన నగరంగా అమరావతి: CBN

image

AP: HYD కన్నా మెరుగైన సిటీగా అమరావతిని అభివృద్ధి చేస్తామని CM చంద్రబాబు పేర్కొన్నారు. ‘HYDలో సైబరాబాద్ నిర్మించా. ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ తెస్తున్నా. 182KM ORRతో గుంటూరు, విజయవాడ, మంగళగిరి ప్రాంతాలతో మహా నగరంగా ఇది మారుతుంది. మరో 15ఏళ్లలో డిఫరెంట్ ప్లేస్ అవుతుంది’ అని వివరించారు. ఒకప్పుడు కరెంటు కష్టాలుండేవని రిఫార్మ్స్‌తో అవి తీరాయన్నారు. ఇప్పుడు ప్రొజ్యూమర్ కాన్సెప్ట్ తెస్తున్నామని చెప్పారు.