News November 26, 2024
‘మహా’ సస్పెన్స్‌కు తెరపడేనా?
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఎంపికపై కూటమి నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు. ముఖ్యమంత్రి రేసులో దేవేంద్ర ఫడణవీస్, ఏక్నాథ్ శిండే, అజిత్ పవార్ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనే అత్యధిక సీట్లు గెలిచినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో శివసేన(శిండే), NCP(అజిత్) మద్దతు కీలకంగా మారింది. మరోవైపు ఇవాళ్టితో అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈ క్రమంలో సాయంత్రంలోగా సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Similar News
News November 26, 2024
ONOS యువత సాధికారతకు గేమ్‌ఛేంజర్: ప్రధాని మోదీ
రీసెర్చ్, లెర్నింగ్, నాలెడ్జ్‌కు మన దేశాన్ని కేంద్రంగా మార్చే లక్ష్యంతో ‘వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్’(ONOS)కు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు PM మోదీ తెలిపారు. విద్యావ్యవస్థ, యువత సాధికారతకు ఇదొక గేమ్‌ఛేంజర్ అని ట్వీట్ చేశారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఉన్నత విద్యాసంస్థలకు వేలాది అంతర్జాతీయ జర్నల్స్ అందుబాటులో ఉంటాయి. ఇది 1.8 కోట్ల మంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది’ అని పేర్కొన్నారు.
News November 26, 2024
మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు
AP: వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై యర్రావారిపాలెం పోలీసులు పోక్సో, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మైనర్ బాలికపై అత్యాచారయత్నం జరిగిందంటూ దుష్ప్రచారం చేశారని, తమ పరువుకు భంగం కలిగించారంటూ బాలిక తండ్రి ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక భవిష్యత్తును దెబ్బతీసే చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
News November 26, 2024
ట్రంప్ అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి బైడెన్
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చే ఏడాది జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనుండగా ఆ కార్యక్రమానికి బైడెన్ హాజరవనున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. ఇది రాజ్యాంగ విలువల పట్ల అధ్యక్షుడికి ఉన్న నిబద్ధత అని పేర్కొంది. 2021లో అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికపై విమర్శలు చేసిన ట్రంప్ ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్లని విషయం తెలిసిందే. మరోవైపు అధికార మార్పిడికి పూర్తిగా సహకరిస్తానని ఇప్పటికే బైడెన్ ప్రకటించారు.