News October 7, 2024
JK, హరియాణాలో బీజేపీ ఓడితే మార్కెట్లు క్రాష్ అవుతాయా?

హరియాణా, JK ఎన్నికల్లో BJP ఓడినా స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. లోక్‌సభ పరంగా అవి చిన్న రాష్ట్రాలేనని పేర్కొన్నారు. ఇప్పటికే మార్కెట్లు డిస్కౌంట్ అవ్వడాన్ని ఉదహరిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికలు మాత్రం కొంతమేర ప్రభావం చూపిస్తాయన్నారు. వెస్ట్ఏషియా యుద్ధం, క్రూడాయిల్ ధరల పెరుగుదల, జియో పొలిటికల్ పరిణామాల గురించే మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయని పేర్కొన్నారు.
Similar News
News January 19, 2026
2030 కల్లా అప్పర్ మిడిల్ క్లాస్ దేశంగా భారత్: SBI

భారత్ ఆర్థికంగా జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోందని SBI తాజా రిపోర్ట్ వెల్లడించింది. 2028 కల్లా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని తెలిపింది. 2030నాటికి ‘అప్పర్ మిడిల్ ఇన్కమ్’ దేశాల క్లబ్లో చేరనుందని పేర్కొంది. అప్పటికీ మన తలసరి ఆదాయం $4,000 (దాదాపు రూ.3,63,541) మార్కును తాకడం ఖాయమని అంచనావేసింది. 2047నాటికి ‘అభివృద్ధి చెందిన దేశం’గా భారత్ గ్లోబల్ లీడర్‌గా నిలవనుందని తెలిపింది.
News January 19, 2026
‘దండోరా’పై జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు

శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘దండోరా’ సినిమాపై హీరో Jr NTR ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా గాఢమైన భావోద్వేగాలతో ఆలోచింపజేసే విధంగా ఉందని అభిప్రాయపడ్డారు. నటీనటులందరి ప్రదర్శన అద్భుతమని తెలిపారు. దర్శకుడు మురళీకాంత్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. ఈ సినిమా JAN 14 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
News January 19, 2026
గంటా 45 నిమిషాల మీటింగ్ కోసం 6 గంటల ప్రయాణం.. ఏదో ఉంది?

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ UAE అధ్యక్షుడు అల్ నహ్యాన్ భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం గంటా 45 నిమిషాల కోసం ఆయన ఆరు గంటలు ప్రయాణించడం గమనార్హం. ఇరాన్ కల్లోలం, సౌదీ-UAE మధ్య యెమెన్ చిచ్చు, గాజా శాంతి చర్చల వంటి ఇష్యూస్ నేపథ్యంలో ఫోన్లో కాకుండా నేరుగా చర్చించేంత బలమైన విషయమేదో ఉందని దౌత్య వర్గాల్లో చర్చ జరుగుతోంది. భారత్‌ను బలమైన భాగస్వామిగా UAE నమ్ముతోంది.


