News August 30, 2024

వనపర్తిలోనే సిద్ధార్థ్‌ను పెళ్లి చేసుకుంటా: అదితి

image

వనపర్తిలోని శ్రీరంగపురం టెంపుల్‌లో నటుడు సిద్ధార్థ్‌ను పెళ్లి చేసుకుంటానని హీరోయిన్ అదితిరావు హైదరీ తెలిపారు. త్వరలోనే పెళ్లి తేదీ ఫిక్స్ చేస్తామని చెప్పారు. ‘హైదరాబాద్‌లో మా నాన్నమ్మ స్థాపించిన స్కూల్‌లోనే సిద్ధు మోకాలిపై కూర్చుని నాకు ప్రపోజ్ చేశారు. ఆయన ప్రపోజ్ చేసిన విధానం నాకెంతో నచ్చింది. మా నాన్నమ్మ ఆశీస్సుల కోసమే ఆయన అక్కడ ప్రపోజ్ చేశారు.’ అని ఆమె పేర్కొన్నారు.

Similar News

News December 7, 2025

కృష్ణా జిల్లాలో వరి కోతలు ప్రారంభం.. కూలీలకు ఉపాధి.!

image

దిత్వా తుఫాన్ అనంతరం వాతావరణం అనుకూలించడంతో జిల్లాలో వరి కోత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షాల కారణంగా యంత్రాలపై ఆధారపడటంతో కూలీలకు ఉపాధి నిలిచిపోయింది. అయితే, ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో రైతులు యంత్రాల వినియోగాన్ని తగ్గించి, తిరిగి కూలీలతో వరి కోతలను ప్రారంభిస్తున్నారు. దీంతో నిలిచిపోయిన కూలీలందరికీ మళ్లీ ఉపాధి లభించే అవకాశం ఏర్పడింది.

News December 7, 2025

ఇవాళ 1,500 సర్వీసులు నడుపుతాం: ఇండిగో

image

ఇండిగో విమానాల సంక్షోభం ఆరో రోజూ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టుల్లో పదుల సంఖ్యలో సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 100 దాకా రద్దు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రయాణికులకు పడిగాపులు తప్పడం లేదు. అయితే ఆదివారం కావడంతో రద్దీ కాస్త తగ్గినట్లు సమాచారం. మరోవైపు 95 శాతం కనెక్టివిటీని పునరుద్ధరించామని ఇండిగో చెబుతోంది. ఇవాళ 1,500 సర్వీసులు నడుపుతామని తెలిపింది.

News December 7, 2025

రబీ నువ్వుల సాగుకు అనువైన రకాలు

image

☛ ఎలమంచిలి 11(TNN వరాహ): పంట కాలం 80-85 రోజులు. నూనె 52%గా ఉంటుంది. దిగుబడి ఎకరాకు 300-350 కిలోలు. ఇది ముదురు గోధుమ రంగు విత్తనం. కోస్తా, రాయలసీమ జిల్లాలకు ఈ రకం అనుకూలం.
☛ ఎలమంచిలి 17: పంటకాలం 75-80 రోజులు. దిగుబడి ఎకరాకు 340-400 కిలోలు. గింజల్లో నూనె 52.5%గా ఉంటుంది. ఇది లేత గోధుమ రంగు విత్తనం. కోస్తా, రాయలసీమ జిల్లాలకు అనుకూలం. ఆకుమచ్చ తెగులను కొంత వరకు తట్టుకుంటుంది.