News October 13, 2025
త్వరలో అమరావతి రైతులను కలుస్తా: CBN

AP: అమరావతి రైతులను <<17990155>>త్వరలో<<>> కచ్చితంగా కలుస్తానని, వారి త్యాగాలను గుర్తుంచుకుంటానని CM చంద్రబాబు అన్నారు. ఇవాళ చాలా ఆనందంగా ఉందని CRDA ఆఫీస్ ప్రారంభ కార్యక్రమంలో చెప్పారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్ అమరావతిలోనే జరిగిందన్నారు. HYDను మించిన రాజధానిని నిర్మిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని నదులన్నీ అనుసంధానం కావాల్సిన అవసరం ఉందన్నారు.
Similar News
News October 13, 2025
వెండిపై పెట్టుబడి: ట్రేడర్‌కు రూ.600 కోట్ల నష్టం!

కమోడిటీ ట్రేడింగులో అనుభవలేమి నిలువునా ముంచుతుందనేందుకు మరో ఉదాహరణ. కొండెక్కిన వెండిని ఒకరు భారీగా షార్ట్ చేశారని స్టాక్ మార్కెట్ కోచ్ ఏకే మాన్‌ధన్ ట్వీట్ చేశారు. అయితే రేటు ఇంకా ఎగిసి ATHకు చేరడంతో బ్రోకర్ ఆ పొజిషన్లను క్లోజ్ చేశారన్నారు. దాంతో ఆ ట్రేడర్ ఏకంగా రూ.600Cr నష్టపోయాడని తెలిపారు. అతడెవరో ఆయన వెల్లడించలేదు. మొదట ఎక్కువ ధరకు అమ్మి తర్వాత తక్కువ ధరకు కొని లాభపడటాన్ని షార్టింగ్ అంటారు.
News October 13, 2025
మరికాసేపట్లో వర్షం

తెలంగాణలో రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో వర్షం కురుస్తుందని IMD తెలిపింది. కొత్తగూడెం, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలో ఇవాళ కోస్తాంధ్రతో పాటు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
News October 13, 2025
TTD డైరీలు వచ్చేశాయ్! ఎక్కడ కొనుగోలు చేయాలంటే?

2026కు సంబంధించి TTD క్యాలెండర్లు, డైరీలను అందుబాటులోకి తెచ్చింది. భక్తుల సౌకర్యార్థం వీటిని ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ కొనుగోలు చేసే సౌకర్యాన్ని కల్పించింది. ఇవి వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరులోని TTD కళ్యాణ మండపాల్లో అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్ శ్రీవారి ఆలయంతో పాటు చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబైలోని ఎంపిక చేసిన ఎస్వీ ఆలయాల్లో కూడా కొనుగోలు చేయవచ్చు.