News March 17, 2024

జగన్‌పై మోదీ విమర్శలు చేస్తారా?

image

AP: అధికారం చేపట్టిన నాటి నుంచి CM జగన్.. ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిస్తూ వస్తున్నారు. దీంతో మోదీ, జగన్ ఎప్పుడూ విమర్శలు చేసుకోలేదు. కానీ ఇటీవల బీజేపీ.. టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఈక్రమంలోనే ఇవాళ చిలకలూరిపేటలో మూడు పార్టీల సంయుక్త సభ జరగనుంది. దీనికి మోదీ హాజరుకానున్నారు. మరి ఈ సభలో తొలిసారి ఆయన జగన్‌పై విమర్శలు చేస్తారా? చేస్తే దేని గురించి మాట్లాడతారు? అనేది ఆసక్తిగా మారింది.

Similar News

News November 25, 2025

లేటెస్ట్ అప్డేట్స్

image

* TG సచివాలయంలో ప్రారంభమైన క్యాబినెట్ భేటీ.. పంచాయతీ ఎన్నికల సన్నద్ధత, విద్యుత్ శాఖ సంబంధిత అంశాలపై చర్చ
* స్థానికసంస్థల ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో మ.2.15కు విచారణ
* మూడు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్న వైసీపీ చీఫ్ జగన్.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు క్యాంప్ ఆఫీసుకు రాక
* నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్, రాము, జనార్దన్ రావుతో పాటు నలుగురికి డిసెంబర్ 9 వరకు రిమాండ్ పొడిగింపు

News November 25, 2025

ఇంట్లోని ఈ వస్తువులతో క్యాన్సర్.. జాగ్రత్త!

image

ఇంట్లో వినియోగించే కొన్ని వస్తువులు క్యాన్సర్ కారకాలుగా మారుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దోమల కాయిల్స్, రూమ్ ఫ్రెష్‌నర్స్, నాన్ స్టిక్ పాత్రలు, ప్లాస్టిక్ డబ్బాలు, టాల్కమ్ పౌడర్, క్యాండిల్స్ పొగ & సిగరెట్ స్మోక్, తలకు వేసుకునే రంగుతో క్యాన్సర్ ప్రమాదం ఉందని తెలిపారు. ఇంట్లో గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవడం, వీటిని వాడటాన్ని తగ్గించడం/ ప్రత్యామ్నాయాలను వాడటం శ్రేయస్కరమని సూచించారు.

News November 25, 2025

సాయంత్రం ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్

image

TG: రాష్ట్ర ఎన్నికల సంఘం సా.6.15 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. పంచాయతీ ఎన్నికలపై షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న క్యాబినెట్ భేటీలో ఎన్నికల తేదీలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ రోజు షెడ్యూల్ ఇచ్చి ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని SEC నిర్ణయించినట్లు తెలుస్తోంది.