News January 28, 2025
మిస్టర్ 360 ఫామ్‌లోకి వస్తాడా?

టీమ్ ఇండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ రాణిస్తున్నా బ్యాటింగ్‌లో మాత్రం విఫలమవుతున్నారు. చివరి 5 టీ20 ఇన్నింగ్స్‌లలో 12, 0, 1, 4, 21 రన్స్ మాత్రమే చేశారు. దీంతో ఇవాళ ENGతో జరిగే మూడో టీ20లోనైనా ఆయన ఫామ్‌లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గత ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు SKY 19 ఇన్నింగ్స్‌లలో 441 రన్స్ చేశారు. యావరేజ్ 24.50గా ఉంది.
Similar News
News March 17, 2025
GOLD: ప్రాఫిట్ బుకింగ్ టైమ్ వచ్చేసిందా!

చివరి మూడేళ్లలో ఏటా బంగారం 17% రాబడి అందించింది. ఔన్స్ రేటు $3000ను తాకడంతో ప్రాఫిట్ బుక్ చేసుకోవడంపై ఇన్వెస్టర్లు సందిగ్ధంలో పడ్డారు. Sensex to Gold రేషియోను బట్టి నిర్ణయించుకోవడం బెటర్ అంటున్నారు Edelweiss SVP నిరంజన్ అవస్థి. 1999 నుంచి ఈ రేషియో 1కి దిగువన ఉంటే తర్వాతి మూడేళ్లలో ఈక్విటీస్, 1 కన్నా ఎక్కువుంటే తర్వాతి మూడేళ్లలో గోల్డ్ రాణిస్తోంది. ప్రస్తుతమిది లాంగ్‌టర్మ్ సగటు 0.96కు దిగువన ఉంది.
News March 17, 2025
మరోసారి సంక్రాంతికి అనిల్ రావిపూడి మూవీ

మెగాస్టార్ చిరంజీవి సినిమాతో 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామివారిని ఆయన దర్శించుకున్నారు. మెగాస్టార్‌తో తీయబోయే మూవీ స్క్రిప్ట్ స్వామి సన్నిధిలో పెట్టి పూజలు నిర్వహించారు. సినిమా కథలకు వైజాగ్‌ను తాను సెంటిమెంట్‌గా భావిస్తానని చెప్పారు. ఆయన తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
News March 17, 2025
రంజాన్ సెలవు ఎప్పుడంటే?

ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ క్యాలెండర్ ప్రకారం మార్చి 31న రంజాన్ సెలవు ఉంది. రంజాన్ హాలిడేలో ఏదైనా మార్పులు చోటు చేసుకుంటే సాంఘిక శాస్త్రం పరీక్షలో మార్పు చేయనున్నారు. అంటే మార్చి 31 లేదా ఏప్రిల్ 1న నిర్వహిస్తామని ప్రభుత్వం ఇదివరకే తెలిపింది. అటు తెలంగాణలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.