News December 23, 2024
మస్క్ అమెరికా అధ్యక్షుడు అవుతారా?: ట్రంప్ ఆన్సర్ ఇదే
US అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్నకు రిపబ్లికన్ కాన్ఫరెన్స్లో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించనున్న స్పేస్ ఎక్స్ అధినేత, టెస్లా సీఈవో మస్క్ అమెరికా అధ్యక్షుడవుతారా? అన్న ప్రశ్నకు ‘అది సాధ్యం కాదు. నేను సేఫ్. ఎందుకంటే మస్క్ USలో జన్మించలేదు’ అని సమాధానమిచ్చారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అక్కడ పుట్టినవారికే అధ్యక్షుడయ్యే అవకాశం ఉంటుంది. కాగా మస్క్ సౌతాఫ్రికాలో జన్మించారు.
Similar News
News December 23, 2024
రేవతి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని TFCC నిర్ణయం
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్కు అండగా ఉంటామని తెలిపింది. వారి కుటుంబానికి సాయం చేసేందుకు మనీ డొనేట్ చేయాలని ఛాంబర్ మెంబర్లను కోరుతూ సర్క్యులర్ జారీ చేసింది.
News December 23, 2024
తప్పు చేసిన ఎవరినీ వదలం: మంత్రి కొల్లు రవీంద్ర
AP: మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం మాయం చేసింది వాస్తవం కాదా? అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. దారి మళ్లిన బియ్యం స్కామ్పై వివరణ ఇచ్చుకోలేని దుస్థితి ఆయనది అని ఎద్దేవా చేశారు. తప్పు చేయనప్పుడు దొంగలా తప్పించుకొని తిరగడమెందుకని నిలదీశారు. తప్పు చేసిన ఎవరినీ వదలబోమని చెప్పారు. రేషన్ కుంభకోణంపై సిట్ ఏర్పాటుకు సిఫార్సు చేస్తామని, విచారణలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలుంటాయన్నారు.
News December 23, 2024
అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయించింది కాంగ్రెస్సే: బీఆర్ఎస్
TG: అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన ముఠాను KTR పంపారని ప్రచారం చేస్తున్న వారిపై BRS మండిపడింది. ‘గూండాలతో అల్లు అర్జున్ ఇంటిపై దాడులు చేయించి కాంగ్రెస్ పార్టీ అడ్డంగా దొరికిపోయింది. ఇప్పుడు ప్రజల దృష్టి మరల్చేందుకు ఫేక్ ఎడిట్లతో ముందుకు వచ్చింది. రేవంత్ సర్కార్ డైవర్షన్ రాజకీయాలతో కాలం గడుపుతోంది. ఫేక్ ఎడిట్లు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని X వేదికగా హెచ్చరించింది.