News January 4, 2025
150 రన్స్ కొట్టాక నితీశ్ ఇలా సెలబ్రేట్ చేస్తారా?

ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ టెస్టులో అర్ధ సెంచరీ తర్వాత భారత ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి పుష్ప స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈసారి 150 రన్స్ కొట్టి ‘సలార్’లో కత్తి తిప్పే సీన్ను అనుకరిస్తూ సెలబ్రేట్ చేసుకోవాలని ఓ అభిమాని ఆయన్ను కోరారు. ‘తప్పకుండా’ అంటూ నితీశ్ రిప్లై ఇచ్చారు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్లో నితీశ్ ఈ వాగ్దానాన్ని పూర్తిచేస్తారంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
Similar News
News December 9, 2025
ఫ్రాడ్ కాల్స్ వేధిస్తున్నాయా?

ప్రస్తుతం చాలా మందిని ఫ్రాడ్ కాల్స్, మెసేజ్లు వేధిస్తున్నాయి. అయితే వాటిపై మనం ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. సంచార్ సాథీ (<
News December 9, 2025
నువ్వుల విత్తనాలను వెదజల్లేకంటే విత్తడం మేలట

నువ్వుల పంట కోసం విత్తనాలను సాధారణంగా రైతులు వెదజల్లుతారు. అయితే విత్తనాన్ని వెదజల్లడం కంటే విత్తడం మేలంటున్నారు నిపుణులు. విత్తనాలను వరుసల మధ్య 30సెం.మీ, మొక్కల మధ్య 15సెం.మీ దూరం ఉండేటట్లు విత్తుకోవాలంటున్నారు నిపుణులు. విత్తనాలను వరుసలలో విత్తితే కలుపు తీసుకోవడానికి అనువుగా ఉండటమే కాకుండా మొక్కకు నీరు, పోషకాలు, సూర్యరశ్మి సమానంగా అంది కొమ్మలు బాగా వృద్ధి చెంది అధిక దిగుబడులు సాధించవచ్చు.
News December 9, 2025
మహాలక్ష్మి పథకంతో మహిళలకు రూ.8,459 కోట్లు ఆదా: పొన్నం

TG: మహాలక్ష్మి పథకం ద్వారా RTCలో మహిళలకు ఉచిత ప్రయాణాలు మొదలై రెండేళ్లు పూర్తయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. రెండేళ్లలో మహిళలు 251 కోట్ల జీరో టికెట్ల ద్వారా రూ.8,459 కోట్లు ఆదా చేసినట్లు వెల్లడించారు. బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాకుండా మహిళలను బస్సులకు యజమానులుగా చేసిన ప్రభుత్వంగా నిలిచిందని పేర్కొన్నారు.


