News July 30, 2024
రేపు రాలేను.. త్వరలోనే వస్తా: రాహుల్ గాంధీ

కేరళ: వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి 123 మంది మృతి చెందారు. ఆ బాధిత కుటుంబాలను కలవడంతో పాటు పరిస్థితిని సమీక్షించడానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ రేపు వయనాడ్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే ఎడతెరిపిలేని వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పర్యటన వాయిదా వేసుకున్నారు. త్వరలోనే వయనాడ్‌కు వస్తానని రాహుల్ X వేదికగా హామీ ఇచ్చారు. అటు కేరళకు తమిళనాడు రూ.5కోట్లు విరాళం ప్రకటించింది.
Similar News
News January 10, 2026
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్

సూపర్ స్టార్ కృష్ణ మనుమడు, ఘట్టమనేని రమేశ్ బాబు తనయుడు జయకృష్ణ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ‘RX 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న మూవీకి ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మహేశ్ బాబు తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో రవీనా టాండన్ కూతురు రాషా తడాని హీరోయిన్‌గా నటిస్తుండగా, జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు.
News January 10, 2026
కోటీశ్వరులు పెరిగారు!

దేశంలో కోటీశ్వరుల సంఖ్య 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా పెరిగింది. ఈ-ఫైలింగ్ పోర్టల్ సమాచారం మేరకు కోటికి పైగా ఆస్తులు ప్రకటించిన వారి సంఖ్య 3,17,098 నుంచి 3,85,752కి పెరిగింది. మరోవైపు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 9 కోట్లకు పైగా ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి. అంతకుముందు ఇది 8.92 కోట్లుగా ఉండేది. కోటీశ్వరుల సంఖ్యలో 21.65% వృద్ధి నమోదు కాగా, రిటర్నులు 1.22% మాత్రమే పెరగడం గమనార్హం.
News January 10, 2026
వంటింటి చిట్కాలు

* పిండి వంటలు చేసేటపుడు మూకుడులో నూనె పొంగకుండా ఉండాలంటే మరుగుతున్న నూనెలో తమలపాకు వేసి, అది రంగు మారాక తీస్తే సమస్య ఉండదు.
* గారెలు, వడలు చేసే పిండిలో కొద్దిగా సేమియాను పొడిగా చేసి కలిపితే నూనె లాగవు. కరకరలాడతాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* సమోసా కరకరలాడుతూ రావాలంటే మైదా పిండిలో కాస్త మొక్కజొన్న పిండిని కలిపితే సరిపోతుంది.


