News April 7, 2025
ఇకపై CSK మ్యాచ్‌లు కవర్ చేయం: అశ్విన్ YT ఛానల్

CSK ప్లేయర్ అశ్విన్‌కు చెందిన యూట్యూబ్ ఛానల్‌లో ఓ అనలిస్ట్ చెన్నై టీమ్ సెలక్షన్‌ను తప్పుబట్టారు. దీనిపై ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వివాదంపై యూట్యూబ్ ఛానల్ ప్రకటన విడుదల చేసింది. ‘ఇకపై CSK మ్యాచ్‌లను కవర్ చేయం. ఛానల్‌లో గెస్ట్‌లు చేసే వ్యాఖ్యలతో అశ్విన్‌కు ఎలాంటి సంబంధం ఉండదు’ అని వివరణ ఇచ్చింది. అశ్విన్‌కు ఛానల్ ఉన్నట్లు తనకు తెలియదని ఇటీవల చెన్నై కోచ్ ఫ్లెమింగ్ అన్నారు.
Similar News
News February 4, 2026
భారీగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు

AP: క్యాన్సర్… రోగుల్ని, వారి ఫ్యామిలీలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఈ క్యాన్సర్ కేసులు APలో భారీగా పెరుగుతున్నాయి. 2021-2025 మధ్య 1.6L కేసులు తేలాయి. గ్రామీణ, చిన్న పట్టణాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. రోగుల్లో 65% మహిళలే. వీటి వైద్యంలో 12.6 లక్షల ఎపిసోడ్స్(చికిత్స)లు నమోదు కాగా ₹3061CR ఖర్చయినట్లు అంచనా. దీనిపై సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు GOVTకి నివేదిక ఇచ్చారు.
News February 4, 2026
USతో ట్రేడ్ డీల్.. వ్యవసాయం, డెయిరీకి పూర్తి రక్షణ: కేంద్రం హామీ

USతో ట్రేడ్ డీల్ వల్ల భారత వ్యవసాయ, డెయిరీ రంగాలకు నష్టం వాటిల్లుతుందని వస్తోన్న విమర్శలను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కొట్టిపారేశారు. ఇలాంటి సెన్సిటివ్ సెక్టార్స్‌కు పూర్తి రక్షణ కల్పించేలా డీల్ కుదుర్చుకొన్నామని పార్లమెంట్‌లో ప్రకటించారు. దాదాపు ఏడాది పాటు సాగిన సుదీర్ఘ చర్చల్లో ఇరు దేశాలూ తమ తమ సున్నితమైన అంశాలను రక్షించుకునేలాగే నియమ నిబంధనలను పొందుపర్చామని స్పష్టం చేశారు.
News February 4, 2026
‘వారణాసి’ మూవీకి నెట్‌ఫ్లిక్స్ రూ.650 కోట్ల ఆఫర్?

SS రాజమౌళి, మహేశ్ బాబుల క్రేజీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.650 కోట్ల భారీ ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే భారతీయ సినిమా చరిత్రలోనే ఇదే అతిపెద్ద ఓటీటీ డీల్ అవుతుంది. థియేట్రికల్ రన్‌ను కాపాడేందుకు సినిమా విడుదలైన 8 వారాల తర్వాతే OTTలో స్ట్రీమింగ్ అయ్యేలా మేకర్స్ ఒప్పందం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది.


