News September 16, 2025

కోహ్లీ బయోపిక్ డైరెక్ట్ చేయను: అనురాగ్ కశ్యప్

image

కోహ్లీ అంటే అభిమానం ఉన్నా ఆయన బయోపిక్‌కు తాను దర్శకత్వం వహించనని డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అన్నారు. కోహ్లీ అంటే అందరికీ ఇష్టమని, ఆయనొక అద్భుతమని కొనియాడారు. ఒకవేళ ఎవరిదైనా బయోపిక్ చేయాల్సి వస్తే కష్టమైన సబ్జెక్ట్‌నే ఎంచుకుంటానని తెలిపారు. సాధారణ వ్యక్తి జీవితాన్ని తెరపై చూపిస్తానని పేర్కొన్నారు. కాగా అనురాగ్ తెరకెక్కించిన ‘నిషాంచి’ మూవీ ఈ నెల 19న రిలీజ్ కానుంది.

Similar News

News January 28, 2026

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

image

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. రెండు విడతల్లో సమావేశాలను నిర్వహించనున్నారు. నేటి నుంచి FEB 13 వరకు తొలి విడత, మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత సెషన్ జరగనుంది. మొత్తం 30 రోజులు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. నిన్న జరిగిన ఆల్ పార్టీ మీటింగ్‌లో MGNREGA, SIR, UGC నిబంధనలు తదితర అంశాలపై చర్చలు పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

News January 28, 2026

ప్రైవసీ ఉల్లంఘన ఆరోపణలు అవాస్తవం: వాట్సాప్‌

image

ప్రైవసీ ఉల్లంఘన <<18971131>>ఆరోపణలను<<>> WhatsApp మాతృసంస్థ Meta ఖండించింది. ‘మీ మెసేజ్‌లు ప్రైవేట్‌గానే ఉంటాయి. ఓపెన్ సోర్స్ సిగ్నల్ ప్రోటోకాల్‌తో ఎన్‌క్రిప్ట్ (హైడ్) చేస్తాం. మీ డివైజ్ నుంచి బయటకు వెళ్లే ముందే మెసేజ్‌లు ఎన్‌క్రిప్ట్ అవుతాయి. మీరు ఎవరికి పంపారో వాళ్లు మాత్రమే చదవగలరు. వాట్సాప్, మెటా వాటిని యాక్సెస్ చేయలేవు’ అని స్పష్టం చేసింది. కాగా Meta మెసేజ్‌లను చదవగలదని USలో దావా దాఖలవడంతో ఇలా స్పందించింది.

News January 28, 2026

T20 WC.. ఎవరైనా అప్‌సెట్ చేయొచ్చు: ద్రవిడ్

image

T20 WCలో భారత్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోందని మాజీ కోచ్ ద్రవిడ్ అన్నారు. ‘ఇండియా వేరే లెవెల్‌లో ఆడుతోంది. సెమీస్‌కు ఈజీగా చేరుకుంటుంది. కానీ నా గత అనుభవాలను బట్టి చెబుతున్నా. ఆ రోజున ఏ టీమ్ బాగా ఆడితే అదే గెలుస్తుంది. ఎవరో ఒకరు మంచి ఇన్నింగ్స్ ఆడి మిమ్మల్ని అప్‌సెట్ చేయొచ్చు’ అని పేర్కొన్నారు. ODI, T20ల్లో IND డామినెన్స్‌కు రోహిత్ శర్మ కారణమని ‘THE RISE OF THE HITMAN’ బుక్ లాంచ్ ఈవెంట్‌లో చెప్పారు.