News April 29, 2024
అశ్విన్‌కు జట్టులో చోటే ఇవ్వను: సెహ్వాగ్

రాజస్థాన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఆటతీరులో దూకుడు లేదని టీమిండియా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ విమర్శించారు. వికెట్లు తీయడం లేదని మండిపడ్డారు. ‘అశ్విన్ ఈ తీరులో ఆడాలనుకుంటే నేనైతే జట్టులో చోటే ఇవ్వను. తన తోటి బౌలర్లు చాహల్, కుల్దీప్ వికెట్లు తీస్తుంటే, తను మాత్రం రన్స్ కట్టడి చేయాలని చూస్తున్నారు. ఆఫ్‌స్పిన్ వదిలేసి క్యారమ్ బాల్స్ వేస్తున్నారు. తన మైండ్ సెట్ మారాలి’ అని స్పష్టం చేశారు.
Similar News
News December 9, 2025
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అసిమ్ మునీర్

పాకిస్థాన్ తొలి రక్షణ దళాల చీఫ్ (CDF)గా నియమితులైన అసిమ్ మునీర్ మరోసారి భారత్ లక్ష్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఏదైనా దాడి జరిగితే పాక్ ప్రతిస్పందన ఈసారి మరింత వేగంగా, తీవ్రంగా ఉంటుందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా అణుబాంబు బెదిరింపులు సహా గతంలో కూడా <<18043029>>మునీర్<<>> ఇలాంటి కామెంట్స్ చేశారు.
News December 9, 2025
గాఢ సేంద్రియ ఎరువులతో ఎక్కువ లాభం

స్థూల సేంద్రియ ఎరువుల కంటే నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాలను ఎక్కువగా కలిగి ఉండి నేలకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తాయి. ఉదాహరణ: కొబ్బరి పిండి, నువ్వుల పిండి, వేరుశనగ పిండి, ఆముదపు పిండి, కానుగ పిండి, పత్తి గింజల పిండి, చేపల పొట్టు, ఎముకల పొడి, కొమ్ముల పొడి, వర్మి కంపోస్టు మొదలైనవి. వీటి కొనుగోలు కాస్త ఖర్చుతో కూడుకున్నదైనా నిపుణుల సూచనల మేరకు వీటిని వినియోగిస్తే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంది.
News December 9, 2025
పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్?

వ్యాపారవేత్త రాజ్‌హిత్ ఇబ్రాన్‌తో హీరోయిన్ నివేదా పేతురాజ్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరి వివాహం రద్దయినట్లు ప్రచారం జరుగుతోంది. తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి ఎంగేజ్మెంట్ పోస్ట్‌ను తొలగించడం, ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఇటీవలే క్రికెటర్ స్మృతి మంధాన వివాహం కూడా ఎంగేజ్మెంట్ తర్వాత రద్దయింది.


