News September 26, 2024

ఈ జన్మలో టీడీపీలో చేరను: విజయసాయి రెడ్డి

image

తాను టీడీపీలో చేరేందుకు ప్రయత్నించినట్లు మంత్రి అచ్చెనాయుడు చేసిన వ్యాఖ్యలను విజయసాయి రెడ్డి ఖండించారు. ‘దేవుడు నిన్ను పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% మాత్రమే ఇచ్చాడాయె! దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందకపోవడంతో మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయి. నా విధేయతపై జోకులు పేలుస్తున్నావు. నువ్వు ఎంత గట్టిగా అనుకున్నా నేను ఈ జన్మలో కులపార్టీ అయిన టీడీపీలో చేరను’ అని ట్వీట్ చేశారు.

Similar News

News January 21, 2026

భారత్‌లో ఆడండి.. లేదంటే బయటకు వెళ్లండి: ICC

image

బంగ్లాదేశ్ జట్టు T20 వరల్డ్ కప్ మ్యాచులను భారత్‌లో ఆడాల్సిందేనని ICC తేల్చిచెప్పింది. తటస్థ వేదికలో ఆడతామన్న BCB వినతిపై ఇవాళ ICC ఓటింగ్ నిర్వహించగా, 14-2తో రిజెక్ట్ అయింది. దీంతో రేపటి లోపు తమ నిర్ణయం చెప్పాలని BCBకి అల్టిమేటం ఇచ్చింది. నో చెబితే మరో జట్టుతో రిప్లేస్ చేస్తామని ప్రకటించింది. ఒకవేళ బంగ్లా రాకపోతే క్వాలిఫయర్స్ మ్యాచుల పాయింట్స్ ఆధారంగా స్కాట్లాండ్‌కు ఛాన్స్ ఎక్కువ ఉంది.

News January 21, 2026

జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ఆలయాలు..

image

ముంబైలోని మహాలక్ష్మి, సిద్ధి వినాయక ఆలయాలు, తిరుమల, వెల్లూర్ స్వర్ణ దేవాలయం, కాశీ విశ్వనాథుడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, జమ్మూ వైష్ణో దేవి క్షేత్రాలు అత్యంత ఆధ్యాత్మిక అనుభూతినిస్తాయి. కోణార్క్ సూర్య దేవాలయం, శ్రీరంగపట్నంలోని నిమిషాంబ ఆలయాలు విశిష్ట శిల్పకళకు, భక్తికి నిలయాలు. అరుణాచల, శ్రీకాళహస్తి క్షేత్రాలను సందర్శించడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు సకల కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం.

News January 21, 2026

బంగ్లాదేశ్‌పై PIL… కోర్టు సీరియస్

image

బంగ్లాదేశ్‌లో హిందువులను హింసిస్తున్నందున ఆ దేశాన్ని క్రికెట్ టోర్నమెంట్ల నుంచి నిషేధించాలని ఢిల్లీ హైకోర్టులో PIL దాఖలైంది. లా విద్యార్థి దాఖలు చేసిన దీనిపై చీఫ్ జస్టిస్ ఉపాధ్యాయ సీరియస్ అయ్యారు. ‘ఇదేం పిటిషన్. ఆ దేశం మా పరిధిలోకి వస్తుందా? మేము అక్కడికి వెళ్లి విచారించాలా? ICC మా పరిధిలోదా?’ అని ప్రశ్నించారు. హెచ్చరికతో వదిలేస్తున్నామని, సమాజంలో చేయాల్సినవి చాలా ఉన్నాయని హితవు పలికారు.