News June 13, 2024
పాక్ టీమ్‌కు సపోర్టు చేయను: వసీం అక్రమ్

పాకిస్థాన్ టీమ్‌లో అంతర్గత కుమ్ములాటలు, వరుస ఓటములపై ఆ దేశ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ అసహనం వ్యక్తం చేశారు. ఎవరు ఏమనుకున్నా ఇకపై తమ జట్టుకు సపోర్టు చేయబోనని స్పష్టం చేశారు. తన మాటలు వైరలైనా పట్టించుకోనని తెలిపారు. ‘జట్టులోని ఆటగాళ్లకు విభేదాలున్నట్లు కనిపిస్తోంది. మీరంతా దేశం కోసం ఆడుతున్నారని గుర్తించండి. ఇకనైనా అన్నీ పక్కన పెట్టి క్రికెట్ ఆడండి’ అని సూచించారు.
Similar News
News November 20, 2025
హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా బుధవారం రాత్రి వరకు హిడ్మా, అతని భార్య రాజేతోపాటు మరో మావోయిస్టు మృతదేహానికి మాత్రమే రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగింది. మరో ముగ్గురి మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు వేచి చూస్తున్నారు.
News November 20, 2025
శబరిమల భక్తులకు అలర్ట్!

భక్తులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్పాట్ బుకింగ్స్‌ను 20 వేల నుంచి 5 వేలకు తగ్గించింది. వర్చువల్ క్యూ ద్వారా మరో 70 వేల మందిని అనుమతించనుంది. ఈ మేరకు రోజుకు 75 వేల మందికి దర్శనం కల్పించనుంది. అడవి మార్గంలో వచ్చే భక్తులకు పాసులు తప్పనిసరి అని స్పష్టం చేసింది. రద్దీని తగ్గించేందుకు నీలక్కల్ దగ్గర కొత్తగా 7 బుకింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది.
News November 20, 2025
నేడు సీబీఐ కోర్టుకు జగన్

AP: అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన కోర్టుకు వస్తారని సమాచారం. తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి బేగంపేటకు చేరుకుంటారని తెలుస్తోంది. మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో భారీ ర్యాలీ నిర్వహించాలని YCP నాయకులు భావిస్తున్నారు.


