News March 27, 2025

సుంకాల విషయంలో ఆ దేశాల్లాగా భారత్‌ను ట్రీట్ చేయబోం: US

image

భారత్‌ను చైనా, మెక్సికో, కెనడాతో కలిపి చూడబోమని US వాణిజ్య అధికారులు స్పష్టం చేశారు. ఆ దేశాలతో కరెన్సీ అవకతవకలు, అక్రమ వలసలు, ఇతర భద్రతా విషయాలకు సంబంధించి తమకు సమస్యలు ఉన్నాయని తెలిపారు. INDతో కేవలం టారిఫ్ సమస్యలే ఉన్నాయని, వాటిని కూడా పరిష్కరించుకునేందుకు చర్చలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. కాగా INDతో సహా ఇతర దేశాలకు పరస్పర సుంకాలను అమలు చేస్తామని ట్రంప్ గతంలోనే ప్రకటించారు.

Similar News

News March 31, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
* సన్నబియ్యం పథకం అమలు చేస్తున్న తొలి రాష్ట్రం మనదే: ఉత్తమ్
* దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల కుట్ర: బండి
* AP: పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు
* రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే నేను CBNకు మద్దతిచ్చా: పవన్
* SRHకు వరుసగా రెండో ఓటమి

News March 31, 2025

ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం

image

ఐపీఎల్‌లో భాగంగా సీఎస్కేతో జరిగిన ఉత్కంఠ మ్యాచులో ఆర్ఆర్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్కే 176/6 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ రుతురాజ్ (63) హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకుండా పోయింది. రాజస్థాన్ బౌలర్లలో హసరంగ 4, ఆర్చర్, సందీప్ శర్మ ఓ వికెట్ తీశారు. ఈ సీజన్‌లో ఆర్ఆర్‌కు ఇదే తొలి విజయం. సీఎస్కేకు వరుసగా రెండో ఓటమి.

News March 31, 2025

పవన్ సూచన.. పిఠాపురంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలతో జనసేన నేతలు పిఠాపురంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. స్థానిక నేతలు ముస్లిం ఇమామ్‌లను సత్కరించారు. రంజాన్ తోఫాలు అందజేశారు. ఈ ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

error: Content is protected !!