News March 29, 2024

కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటా: దానం నాగేందర్

image

తనకు బీఆర్ఎస్‌లో అవకాశం ఇచ్చిన కేసీఆర్‌కు రుణపడి ఉంటానని కాంగ్రెస్ నేత దానం నాగేందర్ తెలిపారు. ‘ఆయన గొప్ప నాయకుడు. కానీ వారి చుట్టూ కందిరీగల్లా కొంతమంది చేరారు. వారి గురించి త్వరలోనే తెలుసుకుంటారు. నాకు ఆత్మగౌరవం ముఖ్యం. కాంగ్రెస్‌లో నిర్మొహమాటంగా, స్వేచ్ఛగా మాట్లాడగలను’ అని పేర్కొన్నారు. కాగా.. దానంపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. కేసీఆర్ ఆయన్ను కన్నబిడ్డలా చూసుకున్నారని వివరించారు.

Similar News

News January 19, 2026

వందే భారత్ స్లీపర్ ఫుడ్ మెనూ ఇదే..

image

వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణికుల కోసం బెంగాల్, అస్సాం ప్రాంతీయ వంటకాలతో ప్రత్యేక మెనూ సిద్ధం చేశారు. ఇందులో బెంగాలీ స్పెషల్స్ అయిన బాసంతి పులావ్, ఛోలార్ దాల్, మూంగ్ దాల్, ధోకర్ వంటి సంప్రదాయ వంటకాలు ఉన్నాయి. అస్సామీ రుచుల కోసం సువాసనలు వెదజల్లే జోహా రైస్, మతి మోహర్, మసూర్ దాల్, సీజనల్ వెజిటబుల్ ఫ్రైస్ అందిస్తున్నారు. ఇక తీపి వంటకాల్లో సందేశ్, నారికోల్ బర్ఫీ, రసగుల్లాలను చేర్చారు.

News January 19, 2026

మున్సిపల్ ఎన్నికలు.. మంత్రులకు ఇన్‌ఛార్జ్‌ల బాధ్యతలు

image

TG: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రులను లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జ్‌లుగా CM రేవంత్ నియమించారు. NZB-ఉత్తమ్, మల్కాజిగిరి-కోమటిరెడ్డి, KNR-తుమ్మల, నల్గొండ-అడ్లూరి లక్ష్మణ్, WGL-పొంగులేటి, చేవెళ్ల-శ్రీధర్ బాబు, KMM-సురేఖ, మహబూబాబాద్-పొన్నం, MBNR-దామోదర, జహీరాబాద్-అజహరుద్దీన్, MDK-వివేక్, నాగర్ కర్నూల్-వాకిటి శ్రీహరి, భువనగిరి-సీతక్క, PDPL-జూపల్లి, ADB-సుదర్శన్ రెడ్డి(ప్రభుత్వ సలహాదారు)

News January 19, 2026

మీరు చేస్తేనే పిల్లలు నేర్చుకుంటారు

image

కొందరు తల్లిదండ్రులు మా పిల్లలకు ఏం చెబుతున్నా చెయ్యట్లేదు. మాట వినట్లేదు అని బాధపడుతుంటారు. కానీ పెద్దలను చూసే పిల్లలు ఏదైనా పాటిస్తారంటున్నారు నిపుణులు. మనం తీసుకొనే ఆహారం నుంచి వ్యాయామం వరకు వాళ్లు చూసే నేర్చుకుంటారు. సానుకూలంగా ఆలోచించడం, క్లిష్టపరిస్థితుల్లో ధైర్యంగా ఉండటం పేరెంట్స్‌ని చూసే నేర్చుకుంటారు. అలాగే వారి మాటలను శ్రద్ధగా వింటేనే తమ మనసులోని మాటలు స్వేచ్ఛగా పంచుకోగలుగుతారు.