News February 22, 2025

భారత్ చేతిలో ఓడితే పాకిస్థాన్ ఇంటికే?

image

ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. గ్రూప్-Aలోని భారత్-పాక్ మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఓడితే టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. ఇప్పటికే కివీస్ చేతిలో పాక్ ఓడిన విషయం తెలిసిందే. ఒకవేళ భారత్ ఓడితే న్యూజిలాండ్‌తో మార్చి 2న జరిగే మ్యాచ్ మనకు కీలకమవుతుంది. టాప్-2లో ఉండే జట్లు మాత్రమే సెమీస్‌కు క్వాలిఫై అవుతాయి. ప్రస్తుతం గ్రూప్‌-Aలో కివీస్, భారత్ టాప్-2లో ఉన్నాయి.

Similar News

News January 3, 2026

స్టబ్స్, రికెల్టన్‌కు షాక్.. కారణాలివే!

image

T20 WCకి సౌతాఫ్రికా ప్రకటించిన జట్టులో స్టబ్స్, రికెల్టన్‌కు చోటు దక్కలేదు. 2, 3 ఏళ్లుగా టీమ్‌లో రెగ్యులర్ కొనసాగుతున్న వీరికి సెలక్టర్లు షాక్ ఇచ్చారు. ఫామ్ లేమి కారణంగా స్టబ్స్‌ను, టాపార్డర్‌లో ఖాళీ లేకపోవడంతో రికెల్టన్‌ను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.

టీమ్: మార్క్రమ్(C), డికాక్, బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, జోర్జి, లిండే, జాన్సెన్, బాష్, ఎంగిడి, రబాడ, కేశవ్, నోర్ట్జే, మఫాకా, జాసన్ స్మిత్

News January 3, 2026

10 నిమిషాల డెలివరీలపై బ్లింకిట్ ఫౌండర్ ఏమన్నారంటే?

image

క్విక్ కామర్స్‌లో 10 నిమిషాల డెలివరీపై వస్తోన్న విమర్శలపై బ్లింకిట్ (జొమాటో) ఫౌండర్ దీపిందర్ గోయల్ స్పందించారు. ‘స్టోర్లకు దగ్గరగా ఉన్న కస్టమర్లకే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆర్డర్ ప్లేస్ అయిన 2.5 నిమిషాల్లో ప్యాకింగ్ పూర్తవుతుంది. డిస్టెన్స్ 2 KM మాత్రమే ఉంటుంది కాబట్టి 8 నిమిషాల టైమ్ ఉంటుంది. సగటు వేగం గంటకు 15 KM మాత్రమే. దీనివల్ల డెలివరీ ఏజెంట్లకు రిస్క్ ఏం ఉండదు’ అని ట్వీట్ చేశారు.

News January 3, 2026

నవ గ్రహాల చుట్టూ ప్రదక్షిణ ఎందుకు చేయాలి?

image

హనుమ, శివాలయాలకు వెళ్లినప్పుడు నవ గ్రహాలకు ప్రదక్షిణ చేస్తే విశేష ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. ‘శివుడు లయకారుడు. హనుమంతుడు గ్రహాలను నియంత్రించే శక్తిమంతుడు. వీరి సన్నిధిలో ప్రదక్షిణలు చేస్తే జాతకంలోని దోషాలు తొలగి, జనాకర్షణ, ధనాకర్షణ కలుగుతాయి. అపమృత్యు భయాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది’ అంటున్నారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసే విధానం, మంత్రాలు, నియమాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.