News February 5, 2025
డేటా చోరీ జరిగిందని నిరూపిస్తే రూ.10 కోట్లు ఇస్తా: లోకేశ్

AP: రాష్ట్ర ప్రజల డేటా చోరీ <<15354528>>ఆరోపణలపై<<>> వైసీపీ నేతలకు మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. ‘మా హయాంలో డేటా చోరీ జరిగిందని నిరూపిస్తే వైసీపీ నేతలకు వ్యక్తిగతంగా రూ.10 కోట్లు ఇస్తా’ అని ఛాలెంజ్ చేశారు. కాగా 2014లో సీఎం చంద్రబాబు సేవా మిత్ర పేరుతో ప్రజల వ్యక్తిగత డేటా చోరీ చేశారని, ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అదే పని చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది.
Similar News
News December 24, 2025
పాస్టర్లకు రూ.50 కోట్లు విడుదల.. నేడు అకౌంట్లలోకి!

AP: రాష్ట్ర వ్యాప్తంగా 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఇటీవల సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా చెప్పిన విషయం తెలిసిందే. అదే సమయంలో పెండింగ్ బకాయిలు రిలీజ్ చేసి 24వ తేదీలోపు అకౌంట్లలో జమ చేస్తామని ప్రకటించారు. సీఎం హామీ మేరకు నిన్న ప్రభుత్వం రూ.50.04కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇవాళ పాస్టర్ల అకౌంట్లలో ఆ మొత్తం జమకానుంది.
News December 24, 2025
దీపం ఇలా పెట్టాలి: పండితులు

దీపారాధనలో ముందుగా నూనె పోయాలి. ఆ తర్వాతే వత్తులు వేయాలి. వెండి, పంచలోహ, ఇత్తడి, మట్టి కుందులను కడిగిన తర్వాతే వాడాలి. స్టీలు కుందులను వాడకూడదు. కుందులను నేరుగా కింద పెట్టకుండా పళ్లెం/తమలపాకుపై ఉంచాలి. అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగించకూడదు. ఏక హారతిలో కర్పూరం లేదా అడ్డవత్తిని వెలిగించి, దాని సహాయంతోనే దీపారాధన చేయాలి. దీపం నుంచి అగరవత్తులను, ఇతర హారతులను ఎప్పుడూ వెలిగించకూడదని శాస్త్ర వచనం.
News December 24, 2025
వాళ్లకు పెన్షన్లు కట్!

TG: పేదలకు అందాల్సిన పెన్షన్లు పక్కదారి పడుతున్నట్లు ప్రభుత్వం చేపట్టిన సోషల్ ఆడిట్‌లో బయటపడింది. 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా 20వేల శాంపిల్స్ సేకరిస్తే అందులో 2వేల మంది అనర్హులుగా తేలింది. ధనవంతులు, 50ఏళ్లు నిండని వారు, వైకల్యం లేకున్నా దివ్యాంగ పెన్షన్లు, చనిపోయినవాళ్లపై ఇతరులు ఇలా అక్రమంగా చేయూత పొందుతున్నట్లు గుర్తించారు. వీళ్లందరికీ పెన్షన్లు కట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.


