News September 28, 2024

PPF, SSY, పోస్టాఫీస్ స్కీమ్స్ వడ్డీరేట్లు తగ్గిస్తారా?

image

PPF, SSY, SCSS వంటి స్కీముల వడ్డీరేట్లను కేంద్రం 3 నెలలకోసారి రివ్యూ చేస్తుంది. పదేళ్ల G-Sec యీల్డుల కన్నా కనీసం 25BPS ఎక్కువ వడ్డీ ఇస్తుంది. ఇన్‌ఫ్లేషన్ తగ్గడంతో RBI రెపోరేట్ల కోత చేపట్టొచ్చని అంచనా. అప్పుడు G-Sec యీల్డులూ తగ్గుతాయి. దాంతో స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ తగ్గిస్తారని విశ్లేషకుల అంచనా. అక్టోబర్లోనే రివ్యూ ఉంటుంది. మరి కేంద్రం వడ్డీని తగ్గిస్తుందో, పెంచుతుందో చూడాలి. మీ కామెంట్.

Similar News

News December 5, 2025

యూరియాకు ఇవి ప్రత్యామ్నాయం

image

యూరియా కొరతను అధిగమించేలా ప్రస్తుతం మార్కెట్‌లో పంటపై పిచికారీ చేసే అనేక ఎరువులు అందుబాటులోకి వచ్చాయి. నానో యూరియా, నానో DAP, నీటిలో కలిపి పిచికారీ చేసే 19:19:19, 20:20:20, కాంప్లెక్స్ ఎరువులు, అధిక సాంద్రత కలిగిన 13-0-45(HD), ద్రవరూప నత్రజని ఎరువు వంటివి అందుబాటులో ఉన్నాయి. దుక్కిలో సిఫారసుల మేరకు కాంప్లెక్స్ ఎరువులను వేసుకొని, పైరుపై పిచికారీ చేసే ఎరువులను స్ప్రే చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

News December 5, 2025

దీపం కొండెక్కితే..?

image

దీపం కొండెక్కిన తర్వాత ఉప్పును పారే జలంలో నిమజ్జనం చేయాలి. వత్తులను దాచిపెట్టుకోవాలి. ప్రమిదలను శుభ్రం చేసుకొని మళ్లీ వాడొచ్చు. నిమజ్జనం సాధ్యం కాకపోతే నీళ్లలో వేయాలి. శుక్రవారం దీపారాధన చేస్తే శనివారం ఈ పరిహారాలు పాటించాలి. ఆవుకు ఆహారం పెట్టి ప్రదక్షిణలు చేయాలి. ఈ ఉప్పు దీపాన్ని ఇంటికి ఈశాన్య దిశలో పెట్టాలి. ఇలా 11, 21 వారాలు చేస్తే శుభం కలుగుతుంది. దాచిపెట్టుకున్న వత్తులను ధూపంలో వాడుకోవచ్చు.

News December 5, 2025

124 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL)లో 124 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఇంజినీరింగ్ డిగ్రీ 65% మార్కులతో ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1050, SC,ST,PwBDలకు రూ.300 వెబ్‌సైట్: www.sail.co.in