News November 17, 2024
పుష్ప-2 ఆ రికార్డును క్రియేట్ చేస్తుందా?

పుష్ప-2కి ఉత్తరాది రాష్ట్రాల్లో క్రేజ్ పీక్స్లో ఉంది. ఈ నేపథ్యంలో హిందీ బెల్ట్లో ఈ మూవీ రికార్డ్ కలెక్షన్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. హిందీలో తొలిరోజు అత్యధిక కలెక్షన్ల రికార్డు జవాన్(రూ.63.90 కోట్లు) పేరిట ఉంది. ఇక వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్లలో RRR (రూ.223 కోట్లు) అగ్రస్థానంలో ఉంది. పుష్ప-2కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆ రెండింటినీ దాటేందుకు మంచి అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
Similar News
News November 9, 2025
పాలలో వెన్నశాతం పెరగాలంటే?(1/2)

పశువులకు ఇచ్చే దాణాలో కొబ్బరి చెక్క, పత్తి గింజల చెక్క, వేరుశనగ చెక్క, సోయాగింజల చెక్క, పొద్దు తిరుగుడు చెక్క వంటివి ఇవ్వాలి. పశువులకు అందించే మేతలో 1/3వ వంతు ఎండు గడ్డి ఉండాలి. పప్పు జాతి గ్రాసాలైన లూసర్న్, పిల్లి పెసర, జనుము తదితర వాటిని గడ్డి జాతి గ్రాసాలతో కలిపి ఇవ్వాలి. పశుగ్రాసాలను చాప్ కట్టర్ ద్వారా చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి ఇవ్వాలి. దాణాను వీలైనంత వరకు నానబెట్టి పశువుకు ఇవ్వాలి.
News November 9, 2025
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ఉద్యోగాలు

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ 5 పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిలో ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, డెమాన్స్ట్రేటర్ పోస్టులు ఉన్నాయి. విద్యార్హతలు, వయసు, ఎంపిక ప్రక్రియ తదితర వివరాలు పూర్తి స్థాయి నోటిఫికేషన్లో వెల్లడించనున్నారు. వెబ్సైట్: https://handlooms.nic.in/
News November 9, 2025
ఇతిహాసాలు క్విజ్ – 61

ప్రశ్న: యాదవ వంశం నశించాలని కృష్ణుడిని శపించింది ఎవరు? అలా శపించడానికి కారణాలేంటి?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


