News November 7, 2024

రేషన్ కార్డులు తొలగిస్తారా?.. డిప్యూటీ సీఎం స్పందన

image

TG: రేషన్‌కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను తొలగించేందుకే ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టిందన్న ప్రచారాన్ని డిప్యూటీ సీఎం భట్టి ఖండించారు. ‘సర్వే ఆధారంగా పాలన, ప్రణాళిక రూపకల్పన, బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయాలు ఉంటాయి. సర్వే పూర్తయ్యాక సామాజిక వర్గాల వారీగా ప్రజల స్థితిగతులపై వివరాలను బహిర్గతం చేస్తాం. మేధావులు, అన్నివర్గాల అభిప్రాయాలతో కులగణన ప్రశ్నలు రూపొందించాం’ అని వెల్లడించారు.

Similar News

News November 17, 2025

డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు.. క్యాబినెట్ నిర్ణయం!

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరపాలని డిసైడ్ అయింది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. దీంతో డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

ఢిల్లీ పేలుళ్ల కేసు… నేపాల్‌లో మొబైళ్లు, కాన్పూర్‌లో సిమ్‌ల కొనుగోలు

image

ఢిల్లీ పేలుళ్ల కేసులో అనేక కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట వద్ద పేలుళ్లకు 4 వారాల ముందే ఉమర్ బ్లూప్రింట్ రూపొందించాడు. ఇందుకు నేపాల్‌లో పాత మొబైళ్లను, కాన్పూర్లో సిమ్ కార్డుల్ని కొన్నాడు. సిమ్‌ల కోసం ID కార్డులందించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా పేలుడుకు ముందు ఉమర్‌తో ముగ్గురు డాక్టర్లు కాంటాక్ట్ అయినట్లు గుర్తించారు. ఇందులో ఒకరైన పర్వేజ్ నిందితురాలు డా.షహీన్‌కు సోదరుడు.