News August 14, 2025

వీధి కుక్కలు లేకపోతే ఎలుకలు పెరుగుతాయా?

image

ఢిల్లీలో వీధి <<17384668>>కుక్కలన్నింటినీ<<>> షెల్టర్లకు తరలించాలని SC ఆదేశించడం చర్చనీయాంశమైంది. ఫ్లాష్‌బ్యాక్‌కి వెళితే 1880ల్లో రేబిస్ కారణంగా పారిస్ పెద్ద సంఖ్యలో కుక్కలను చంపేసింది. తర్వాత అక్కడ ఎలుకల సంఖ్య బాగా పెరిగింది. సాధారణంగా ఎలుకల నియంత్రణలో వీధి కుక్కలది కీలకపాత్ర. నిజానికి ఎలుకలూ తీవ్ర నష్టం చేయగలవు. అటు వీధులన్నీ తిరిగే కుక్కలు అనేక రోగాల వ్యాప్తికి కారణమనే బలమైన వాదన ఉంది. దీనిపై మీ కామెంట్?

Similar News

News January 18, 2026

ఆలు లేత, నారు ముదర అవ్వాలి

image

ఈ సామెతలో ఆలు అంటే తమలపాకు. అది ఎంత లేతగా ఉంటే అంత రుచిగా, మృదువుగా ఉంటుంది. అలాగే మనిషి కూడా కొన్ని(స్వభావం, మాటతీరు) విషయాల్లో మృదువుగా, సున్నితంగా ఉండాలి. ఇక్కడ నారు అంటే వరి నారు, మొక్కల నారు. అది నాటే సమయానికి ముదరగా ఉంటేనే మంచి పంట వస్తుంది. అలాగే మనిషి కూడా కొన్ని విషయాల్లో (విలువలు, నిర్ణయాలు, పట్టుదల) దృఢంగా, స్థిరంగా ఉంటే మంచిదని ఈ సామెత అర్థం.

News January 18, 2026

కాలసర్ప దోష విముక్తికై నేడు ఇలా..

image

జాతకంలో రాహు-కేతువుల ప్రభావంతో ఏర్పడే కాలసర్ప దోషం వల్ల పనులు మధ్యలో ఆగిపోవడం, నిరాశ వంటివి ఎదురవుతాయి. చొల్లంగి అమావాస్య పర్వదినం దీనికి సరైన పరిష్కార సమయం. ఓ వెండి నాగుపాము ప్రతిమకు భక్తితో పూజ నిర్వహించి, దానిని ప్రవహించే నదిలో లేదా సముద్ర సంగమ జలాల్లో నిమజ్జనం చేయాలి. ఈ పవిత్ర రోజున ఇలా చేయడం వల్ల సర్వ దోషాలు తొలగి, జీవితంలో ఆటంకాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు.