News May 19, 2024
ఆ సెంటిమెంట్‌ను ఆర్సీబీ బ్రేక్ చేస్తుందా?

ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ వరుసగా 5 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచులు గెలిచిన ప్రతీసారి రన్నరప్‌గానే నిలిచింది. 2009లో 5, 2016లో 5, 2011లో 7 వరుస విజయాలు సాధించిన ఆ టీమ్ ఈసారి వరుసగా ఆరు మ్యాచుల్లో గెలుపొందింది. దీంతో ఈసారైనా రన్నరప్‌గా నిలిచే సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి ఛాంపియన్‌గా నిలుస్తుందా? అని క్రీడాభిమానులు చర్చించుకుంటున్నారు.
Similar News
News November 21, 2025
తెలంగాణలో నేడు..

⋆ సా.4 గంటలకు HYD బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం రెండో ఎడిషన్‌ను ప్రారంభించనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
⋆ ఉ.10 గంటలకు JNTU జూబ్లీ సెలబ్రేషన్స్‌లో పాల్గొననున్న సీఎం రేవంత్
⋆ పత్తి రైతులకు మద్దతుగా అఖిలపక్షం ఆందోళన.. NH 44 దిగ్బంధానికి బీఆర్ఎస్ పిలుపు
⋆ ఆర్.కృష్ణయ్య అధ్యక్షతన బీసీ సంఘాల సమావేశం.. రిజర్వేషన్లు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
News November 21, 2025
ఏ వ్రతం ఎప్పుడు చేయాలి?

పెళ్లి కాని అమ్మాయిలు కాత్యాయనీ వ్రతాన్ని ధనుర్మాసంలో చేయాలి. ఈ వ్రతంలో భాగంగా శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ గోదాదేవి రచించిన 30 పాశురాలను నిత్యం పఠిస్తే.. మంచి భర్త వస్తాడని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ మాసంలోని ప్రతి గురువారం (NOV 27, DEC 4, 11, 18) లక్ష్మీదేవికి పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయట. DEC 3వ తేదీన వస్తున్న హనుమద్వ్రతాన్ని ఆచరించడం ద్వారా కూడా శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం.
News November 21, 2025
టెట్ దరఖాస్తులకు మరో 3 రోజులే ఛాన్స్

AP: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) దరఖాస్తుల గడువు ఈ నెల 23తో ముగియనుంది. ఇప్పటివరకు 1,97,823 అప్లికేషన్లు వచ్చాయి. పురుషులు 66,104, మహిళలు 1,31,718 మంది దరఖాస్తు చేశారు. ఇన్ సర్వీస్ టీచర్లకూ TET తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 17,883 మంది టీచర్లూ టెట్‌కు అప్లై చేశారు. అయితే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలైనందున తమకు ఈ పరీక్ష నుంచి మినహాయింపు లభిస్తుందని టీచర్లు ఆశిస్తున్నారు.


