News April 22, 2024

CAA, కొత్త క్రిమినల్ చట్టాలను రద్దు చేస్తాం: చిదంబరం

image

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే NDA తెచ్చిన కొన్ని చట్టాలను సవరించడం లేదా రద్దు చేస్తామని ప్రకటించారు. వాటిలో CAA, మూడు కొత్త క్రిమినల్ చట్టాలు ఉంటాయని తెలిపారు. ‘బెయిల్ అనేది రూల్.. జైల్ అనేది మినహాయింపు అనే కొత్త చట్టాన్ని తీసుకొస్తాం. దేశంలో 65% మంది ఖైదీలు విచారణలో ఉన్నారు. వారు దోషులు కాకపోయినా జైలులో ఎందుకు ఉండాలి?’ అని ప్రశ్నించారు.

Similar News

News November 20, 2024

ప్రపంచాన్ని అంతం చేయగల ‘Dead Hand’?

image

రష్యాలో పుతిన్ సహా అగ్రనాయకత్వాన్ని పాశ్చాత్య దేశాలు అంతం చేస్తే? అది మొత్తం ప్రపంచానికే ప్రమాదం. ఎందుకంటే రష్యా వద్ద ‘డెడ్ హ్యాండ్’(పెరీమీటర్) అనే వ్యవస్థ ఉంది. మొత్తం బలగాలన్నీ తుడిచిపెట్టుకుపోయినా, అక్కడి అధికారి ఎవరైనా ఒక్కరు యాక్టివేట్ చేస్తే చాలు. రష్యా వద్ద ఉన్న అణ్వాయుధాలు మొత్తం శత్రుదేశాల మీదకు లాంచ్ అవుతాయి. తామే పోయేలా ఉంటే అందరూ పోవాలన్న సూత్రంతో సోవియట్ కాలంలో దీన్ని రూపొందించారు.

News November 20, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 20, 2024

నవంబర్ 20: చరిత్రలో ఈ రోజు

image

1750: మైసూరు రాజు టిప్పు సుల్తాన్ జననం
1910: ప్రముఖ రచయిత లియో టాల్‌స్టాయ్ మరణం
1956: తెలుగు సినీ దర్శకుడు వంశీ జననం
1969: నటి శిల్పా శిరోద్కర్ జననం
1981: భాస్కర-2 ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రో (ఫొటోలో)
1994: నటి ప్రియాంక మోహన్ జననం
* ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం