News July 7, 2024
భవిష్యత్‌లో హార్దిక్ స్థానాన్ని భర్తీ చేస్తా: నితీశ్

భారత జట్టులో తనకు తప్పకుండా చోటు దక్కుతుందని నితీశ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆల్‌రౌండర్‌గా భవిష్యత్‌లో హార్దిక్ స్థానాన్ని భర్తీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ఆరు లేదా ఏడో ప్లేస్‌లో బ్యాటింగ్ చేయగలనన్నారు. టీమ్‌కు ఓపెనర్ అవసరం లేదని, ఒకవేళ అవకాశం వస్తే తప్పకుండా సద్వినియోగం చేసుకుంటానని పేర్కొన్నారు. జింబాబ్వే సిరీస్‌కు నితీశ్ ఎంపికైనప్పటికీ గాయంతో తప్పుకున్న విషయం తెలిసిందే.
Similar News
News March 10, 2026
వేసవిలో వ్యాయామం.. ఏ టైమ్‌లో మంచిది!

సమ్మర్‌లో 8am లోపు, 6pm తర్వాత వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘చెట్లు ఎక్కువగా ఉండే పార్కుల్లో అయితే మంచిది. తేలికపాటి, లేతరంగు దుస్తులు, టోపీ ధరించాలి. గంట వ్యాయామం చేసేవాళ్లు 45ని. చేస్తే సరిపోతుంది. డీహైడ్రేషన్‌కు గురికాకుండా మధ్యమధ్యలో తగినన్ని నీళ్లు తాగాలి. అధిక చెమట, బలహీనత, తల తిరగడం, వికారంతోపాటు తలనొప్పి తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే వ్యాయామం నిలిపేయాలి’ అని చెబుతున్నారు.
News March 10, 2026
ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్‌లో ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఆరు నుంచి 12 వారాల్లో బిడ్డ అవయవాలన్నీ ఏర్పడుతాయి. ఈ సమయంలో వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్స్‌రేలకు దూరంగా ఉండాలి. ఏ సమస్య అనిపించినా వైద్యులను సంప్రదించాలి. జ్వరం వస్తే వెంటనే చికిత్స చేయించుకోవాలి. జన్యుపరమైన సమస్యలుంటే తప్ప అబార్షన్ కాదు. అన్ని పనులు చేసుకోవచ్చు. బరువులు ఎత్తడం, పరిగెత్తడం మానేయాలని సూచిస్తున్నారు.
News March 10, 2026
భారత్ నుంచి బంగ్లాకు 5,000 టన్నుల డీజిల్?

ఇండియా నుంచి తమకు పైప్‌లైన్ ద్వారా 5,000 టన్నుల డీజిల్ రానుందని బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్ రెజనూర్ రెహ్మాన్ తెలిపారు. ఏటా 1,80,000 టన్నుల డీజిల్ సరఫరా కోసం భారత్‌తో ఒప్పందం ఉందని.. తాజా దిగుమతి అందులో భాగమేనన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సరఫరాపై ఆందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో బంగ్లా ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. దీనిపై భారత్ స్పందించాల్సి ఉంది.


