News April 8, 2025
త్వరలో బంగ్లాకు తిరిగొస్తా: షేక్ హసీనా

భారత్‌లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో బంగ్లాకు తిరిగివస్తానని, అవామీ లీగ్ శ్రేణులు ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. SMలో వారితో మాట్లాడుతూ బంగ్లా చీఫ్ అడ్వైజర్ యూనస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ప్రజలంటే ప్రేమ లేదన్నారు. అధిక వడ్డీలకు రుణాలిచ్చి విదేశాల్లో విలాసవంతంగా బతికారన్నారు. ఆయన అధికార వాంఛ బంగ్లాను తగలబెడుతోందని దుయ్యబట్టారు.
Similar News
News April 17, 2025
IPL: నేడు ముంబైతో హైదరాబాద్ ఢీ

ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య రా.7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 23 మ్యాచుల్లో తలపడగా MI 13, SRH 10 గెలిచాయి. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో MI ఏడో స్థానంలో, SRH తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. ఇరు జట్లు తమ చివరి మ్యాచులో విజయాన్ని సాధించి తిరిగి ఫామ్ అందుకున్నాయి. దీంతో నేటి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశముంది.
News April 17, 2025
హైదరాబాద్‌లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు

TG: హైదరాబాద్‌లో 26 శాతం ఇళ్ల అమ్మకాలు పడిపోయినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్‌టైగర్ తెలిపింది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య 10,647 యూనిట్ల హౌస్ సేల్స్ జరిగినట్లు వెల్లడించింది. అదే గతేడాది ఇదే వ్యవధిలో 14,298 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగినట్లు పేర్కొంది. బెంగళూరులో 13 శాతం, చెన్నైలో 8 శాతం సేల్స్ పెరిగినట్లు వివరించింది.
News April 17, 2025
నేటి నుంచి ‘భూభారతి’ రెవెన్యూ సదస్సులు

TG: ‘భూభారతి’ పైలెట్ ప్రాజెక్ట్‌కు ఎంపిక చేసిన 4 మండలాల్లో నేటి నుంచి రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి. అక్కడ రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులు దరఖాస్తులు స్వీకరించి, వాటిని పోర్టల్ ద్వారా పరిష్కరిస్తారు. అందులో పరిష్కారం కాకున్నా, పోర్టల్ పని చేయకపోయినా రాష్ట్రస్థాయిలో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. ఈ సదస్సులను మంత్రి పొంగులేటి ఇవాళ నారాయణపేట జిల్లా మద్దూరులో ప్రారంభించనున్నారు.