News October 23, 2024

రేవంత్ ఇప్పటికైనా లెంపలేసుకుంటారా?: KTR

image

TG: BRS నుంచి కాంగ్రెస్‌లో చేరిన MLAలపై వేటువేయాలని MLC జీవన్‌రెడ్డి చేసిన కామెంట్స్‌పై KTR స్పందించారు. ‘రేవంత్ గారు.. మీ సొంత పార్టీ నేతనే మీరు చేసిన MLAల ఫిరాయింపులు అప్రజాస్వామికమని, దుర్మార్గమైన చర్య అని సూటిగా వేలెత్తి చూపుతున్నారు. ఇప్పటికైనా మీరు లెంపలేసుకుంటారా? జీవన్‌రెడ్డి వంటి సీనియర్ నేత ఇది కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమని మీ దిగజారుడు రాజకీయాలపై దుమ్మెత్తి పోశారు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News October 23, 2024

13వేల KMS సైకిల్‌పై ప్రయాణించి రొనాల్డోను చేరిన అభిమాని

image

ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. చైనాకు చెందిన ఓ వీరాభిమాని ఏకంగా 13వేల కిలోమీటర్లు ఆరున్నర నెలలు సైకిల్‌పై ప్రయాణించి రొనాల్డోను కలుసుకున్నారు. సౌదీ ప్రో లీగ్‌లో అల్ షబాబ్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత అభిమాని గురించి తెలుసుకొని రొనాల్డో అతణ్ని కలిసి ఆటోగ్రాఫ్ ఇచ్చారు. విమానంలో ప్రయాణించే స్తోమత లేకపోవడంతో అతను సైకిల్‌పై వెళ్లినట్లు తెలుస్తోంది.

News October 23, 2024

GOOD NEWS: రూ.99కే లిక్కర్ వచ్చేసింది!

image

AP: రాష్ట్రంలో రూ.99కే క్వార్టర్ మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఒక్కో లిక్కర్ షాప్‌నకు 3 నుంచి 8 కేసులు మాత్రమే సరఫరా చేస్తుండగా, త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు వైన్స్ నిర్వాహకులు చెబుతున్నారు. షార్ట్స్ పేరుతో బ్రాండీ, విస్కీ విక్రయాలు కూడా జరుగుతున్నాయి. దీంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News October 23, 2024

గాజా యుద్ధాన్ని ముగించేందుకు ఇదే సమయం: అమెరికా

image

గాజా యుద్ధాన్ని ముగించేందుకు ఇజ్రాయెల్‌కు ఇదే సరైన సమయమని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ తాజాగా పేర్కొన్నారు. ఇరాన్‌తో ఉద్రిక్తతల్ని పెంచొద్దని ఆ దేశానికి సూచించారు. ‘గత ఏడాది అక్టోబరు 7 తర్వాతి నుంచి గాజా విషయంలో ఇజ్రాయెల్ నిర్దేశించుకున్న లక్ష్యాలన్నింటినీ సాధించింది. ఇప్పుడు ఆ విజయాలను శాశ్వతం చేసుకోవాలి. పరిస్థితి మరింత దిగజారనివ్వకూడదు. గాజాకిప్పుడు మానవతాసాయం అవసరం’ అని పేర్కొన్నారు.