News March 7, 2025

ఆ కాంట్రాక్టులు కోల్పోనున్న రోహిత్, విరాట్, జడ్డూ?

image

అన్ని ఫార్మాట్లలోనూ ఆడే క్రికెటర్లకు బీసీసీఐ గ్రేడ్ A+ కాంట్రాక్ట్ ఇస్తుంది. విరాట్, రోహిత్, జడేజా ఆ గ్రేడ్‌లోనే ఉన్నారు. కానీ వీరు T20లకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో గ్రేడ్ పడిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిశాక BCCI దీనిపై ఓ నిర్ణయానికి రావొచ్చని సమాచారం. ఇక గత ఏడాది కాంట్రాక్టు దక్కించుకోలేకపోయిన శ్రేయస్ అయ్యర్‌కు ఈసారి అవకాశం దక్కొచ్చని బోర్డు వర్గాలు తెలిపాయి.

Similar News

News March 5, 2026

ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల

image

ఏపీలో పదో తరగతి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. <>https://bse.ap.gov.in/<<>> సైట్ లేదా మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009, లీప్ యాప్‌‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వెబ్‌సైట్ సర్వర్ బిజీగా ఉండటంతో వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.

News March 5, 2026

కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

image

కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో 5 పోస్టులకు అప్లై చేయడానికి మార్చి 10 ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి BTech/BE (సివిల్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కు నెలకు రూ.65వేలు, ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కు రూ.55వేలు చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.cochinport.gov.in

News March 5, 2026

ఉగాదికి ‘ఉస్తాద్ భగత్‌ సింగ్’

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ముందుగా ప్రకటించినట్లు ఈనెల 26న కాకుండా ఉగాది సందర్భంగా ఈనెల 19న రిలీజ్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు. ‘ఈ ఉగాదికి ఉస్తాద్ ఊచకోత’ అంటూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మూవీలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.