News October 8, 2024

రేపు HYDకు సమంత.. మంత్రి సురేఖ వ్యాఖ్యలపై స్పందిస్తారా?

image

మంత్రి కొండా సురేఖ ఆరోపణల తర్వాత తొలిసారి హీరోయిన్ సమంత రేపు హైదరాబాద్‌కు రానున్నారు. ఆలియా భట్ నటించిన ‘జిగ్రా’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఆమె హాజరుకానున్నారు. దీంతో సమంత ఈ విషయంపై ఏమైనా మాట్లాడతారా? అనేదానిపై చర్చ మొదలైంది. మీడియా ఈ విషయంపై ప్రస్తావిస్తే ఆమె స్పందిస్తారా? లేదా అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. సమంతతో పాటు రానా, త్రివిక్రమ్ కూడా ఈవెంట్‌లో పాల్గొననున్నారు.

Similar News

News November 27, 2025

భాస్వరం, నత్రజని ఎరువులను ఎలా వాడితే ఎక్కువ ప్రయోజనం?

image

పంట నాటిన/విత్తిన రెండు వారాలలోపే మొత్తం భాస్వరం ఎరువులను పంటలకు వేయాలి. పైపాటుగా వాడకూడదు. నత్రజని, పొటాష్ ఎరువులను పూతదశకు ముందే వేసుకోవాలి. సిఫారసు చేసిన మొత్తం నత్రజని ఎరువులను ఒకే దఫాలో కాకుండా మూడు దఫాలుగా (నాటిన/విత్తిన తర్వాత, శాఖీయ దశలో, పూతకు ముందు) వేయడం వల్ల పంటకు ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి అధిక దిగుబడి వస్తుంది. సూక్ష్మపోషక ఎరువులను పంటకు స్ప్రే రూపంలో అందించాలి.

News November 27, 2025

అటు అనుమతి, ఇటు విరాళం.. టాటా గ్రూపుపై సంచలన ఆరోపణలు!

image

BJPకి టాటా గ్రూపు లంచం ఇచ్చిందంటూ సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ సంచలన ఆరోపణలు చేశారు. టాటా గ్రూపు, BJPపై scroll.in రాసిన కథనాన్ని షేర్ చేశారు. ‘సెమీకండక్టర్ యూనిట్లకు మోదీ క్యాబినెట్ ఆమోదం తెలపగానే BJPకి అతిపెద్ద దాతగా టాటా గ్రూపు ఎలా మారింది? 2 యూనిట్లకు సబ్సిడీ కింద ₹44,203Cr టాటాకు వస్తాయి. క్యాబినెట్ అప్రూవల్ వచ్చిన 4 వారాలకు ₹758Crను BJPకి విరాళంగా ఇచ్చింది. ఇది లంచం’ అని ట్వీట్ చేశారు.

News November 27, 2025

BCల రిజర్వేషన్లు తగ్గించలేదు: సీతక్క

image

TG: సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అనుసరించి 50% రిజర్వేషన్ పరిమితిని తప్పనిసరిగా పాటించాల్సి వచ్చిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ‘కొన్ని మండలాల్లో SC, ST జనాభా ఎక్కువగా ఉండటంతో BC రిజర్వేషన్లలో కొంత మార్పు జరిగింది. ఎక్కడా BCల రిజర్వేషన్లు తగ్గించలేదు. సర్పంచుల రిజర్వేషన్లకు మండలాన్ని, వార్డు సభ్యులకు గ్రామాన్ని, ZPTCలకు జిల్లాను, ZP ఛైర్మన్లకు రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకున్నాం’ అని తెలిపారు.